Home Film News Megastar – Sridevi: శ్రీదేవి కారణంగా మెగాస్టార్ కెరీర్ దెబ్బతిందా?
Film News

Megastar – Sridevi: శ్రీదేవి కారణంగా మెగాస్టార్ కెరీర్ దెబ్బతిందా?

Megastar – Sridevi: సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదేవి. ఆమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తన హవా చూపించింది. ఎంతోమంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా శ్రీదేవి కారణంగానే తమ కెరీర్ లో ఎదిగి చూపించారు. కానీ మెగా హీరో చిరంజీవి మాత్రం హీరోయిన్ శ్రీదేవి కారణంగా తీవ్రంగా నష్టపోయారట. చిరంజీవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న టైమ్ లోనే శ్రీదేవి ఫుల్ క్రేజ్ తో ఉంది. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అనే రేంజ్ లో ఎదిగింది. ఈ కారణంతో శ్రీదేవి ఇంటి ముందు నిర్మాతలు క్యూకట్టేవారట.

అందుకే చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో సినిమాలు తీయాలని డైరెక్టర్ అనుకున్నా.. చిరుతో సినిమాల్లో యాక్ట్ చేయడానికి శ్రీదేవి అభ్యంతరాలు చెప్పారట. కొన్నిసార్లైతే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఆ తర్వాత కారణాలు చెప్పి సినిమాలు వదిలేశారట. నిజానికి డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వజ్రాల దొంగ సినిమా కథ రెడీ అయ్యింది. ఈ సినిమాకు శ్రీదేవినే ప్రొడ్యూసర్. సినిమాకి ప్రొడ్యూసర్ నేనే కనుక చిరంజీవి కన్నా శ్రీదేవి పాత్ర హైలెట్ గా ఉండాలని అన్నారట. మరి చిరంజీవి లాంటి స్టార్ ను తగ్గించి చూపించాలనే సాహసం అప్పట్లో డైరెక్టర్లు చేయలేదు. దాంతో మూవీ ఆగిపోయింది.

ఆ తర్వాత కొండవీటి దొంగ మూవీలో కూడా హీరోయిన్ గా ఫస్ట్ శ్రీదేవినే అనుకున్నారట. మళ్లీ సేమ్ కండీషన్ తో రావడం వల్ల ఆమెను మార్చి రాధా, విజయశాంతిలను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో శ్రీదేవినే తగ్గి.. మెగాస్టార్ తో వరుస ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశారు. అదే టైమ్ లో చిరంజీవి, శ్రీదేవి వీరి కాంబోలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ పరశురామ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్ కి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...