Home Film News ‘ఆవేదనతో పుట్టిన ప్యానల్’ : మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్
Film News

‘ఆవేదనతో పుట్టిన ప్యానల్’ : మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్

Prakash Raj Press Meet

నిన్న 27 మందితో ప్యానల్ ని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ఆయన మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తను లోకల్ కాదని, తన వ్యక్తిత్వం మంచిది కాదని చేస్తున్న కామెంట్లను ఆయన తప్పు బట్టారు. ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు తీసుకున్నప్పుడు రాని లోకల్, నాన్ లోకల్ అనే అంశం ఇప్పుడేందుకు తెరమీదకు వస్తుందని అడిగాడు.

ఈ ప్యానల్ ఏర్పడటానికి అన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయని, 900 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ లో అందరికీ న్యాయం జరిగే విధంగా ఇక్కడ పనిచేయాలని అనుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాల స్తాయిలో ఈ విషయాన్ని పెద్దది చేస్తూ రచ్చ చేయాల్సిన అవసరం లేదని, ఇవి ఒక ఇండస్ట్రీకి చెందిన ఎన్నికలు మాత్రమే మనకు రాజకీయాలతో పనిలేదు అంటూ గుర్తు చేసారు.

ఇంకా తన ప్యానెల్ అందరూ ప్రశ్నించే వాళ్ళే ఉన్నారు అని గుర్తు చేస్తూ.. ఒకవేళ తానేదైనా తప్పు చేస్తే తనని పంపేయగలిగే వాళ్ళు తన టీంలో ఉన్నారని చెప్పారు. తన ప్యానల్ లో ఉన్నవాళ్ళు ఇప్పడికే నలుగురు ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రెసిడెంట్ అనేది ఒక బాద్యత మాత్రమే పదవి కాదు అని చెప్పారు.

అలాగే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం తమకి లేదని, మేము ఇప్పటికే పాపులర్ అని మీడియాకి చెప్పారు. తమ ప్యానల్ కి చాలా పనులున్నాయని, వాటికి సంబంధించిన పక్క ప్రణాళికలు తాము సిద్ధం చేసుకున్నామని, రాబోయే రెండేళ్లలో ఏమేం చేయాలన్న విషయంపై కూడా తమకి క్లారిటీ ఉందని తెలిపారు ప్రకాశ్ రాజ్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...