Home Film News Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..
Film News

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

SSMB
SSMB

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న ‘సూపర్ స్టార్’.. ఘట్టమనేని మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతర భాషల సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బావ గల్లా జయదేవ్, సోదరి మంజుల ఘట్టమనేని, సుధీర్ బాబు, అశోక్ గల్లా, అడవి శేష్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, కౌశల్ మండ, కబీర్ దుహాన్ సింగ్, మాలాశ్రీ, డైరెక్టర్స్ సురేందర్ రెడ్డి, బాబీ, రమేష్ వర్మ, సుధీర్ వర్మతో సహా పలు నిర్మాణ సంస్థలు.. ఇతర హీరోల అభిమానులు మహేష్ బాబుకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్విట్టర్‌లో #HBDSuperstarMahesh హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కొద్ది రోజులనుండి మహేష్ ఫ్యాన్స్ ‘పోకిరి’ 4K ప్రింట్‌తో స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఓవర్సీస్ మొదలుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ రికార్డ్ స్థాయిలో షోలు వేశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లోని లార్జ్ స్క్రీన్‌తో సహా పలుచోట్ల ‘ఒక్కడు’ మూవీ స్పెషల్ షోస్ కూడా వేశారు.

https://twitter.com/RahulgoudChint1/status/1556895832661561350

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...