Home Film News Prabhas-Jagapathi Babu: జ‌గ్గూభాయ్ రివీల్ చేసిన అప్‌డేట్‌కి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!
Film News

Prabhas-Jagapathi Babu: జ‌గ్గూభాయ్ రివీల్ చేసిన అప్‌డేట్‌కి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Prabhas-Jagapathi Babu: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రాల‌న్నీ కూడా ఫ్లాపులుగా నిలిచాయి.భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. మూడు వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ప్ర‌భాస్ నుండి వ‌స్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స‌లార్. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో అయిన ప్ర‌భాస్‌కి మంచి హిట్ ద‌క్కుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండ‌గా, జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఇక చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇటీవలే విడుదలైన ‘సలార్: పార్ట్ 1’ సీజ్‌ఫైర్ టీజర్ యూట్యూబ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మ‌నంద‌రికి తెలిసిందే.

తాజాగా స‌లార్ గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించారు జ‌గ‌ప‌తి బాబు. స‌లార్ రెండు భాగాలుగా విడుద‌ల కానుండ‌గా, తొలి పార్ట్‌లో తనకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్స్ ఉండవని చెప్పుకొచ్చాడు జ‌గ్గూభాయ్. ఇక‌ పార్ట్ 2లో మాత్రంలో మా ఇద్దరి కాంబోలో అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. అయితే జ‌గ్గూభాయ్ స్టేట్‌మెంట్‌తో స‌లార్ చిత్రం రెండు భాగాలుగా రానుంద‌ని ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. ఇక కేజీఎఫ్ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి భారీ లాభాలు ఆర్జించిన హోంబలే ఫిలింస్ సంస్థనే ‘సలార్’ చిత్రాన్ని కూడా నిర్మించ‌నుండ‌డంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

కేజీఎఫ్‌ చిత్రానికి త‌న మ్యూజిక్‌తో ప్రాణం పోసిన రవి బస్రూర్ …స‌లార్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక స‌లార్ చిత్రం విడుదలైన మూడు నెలల్లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాల‌ని అనుకుంటున్నారు. జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ వేదికగా సలార్ టైటిల్, ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయనుండ‌గా, దీని కోసం ప్ర‌భాస్ అభమానుల‌తో పాటు సినీ ప్రేమికులు కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్రాజెక్ట్ కే మూవీని నాగ్ అశ్విన్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో . కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తుండ‌డంతో చిత్రంపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...