Home Film News Niharika Konidela: అత్తగారింట్లో ఇలా చేయ‌డం వ‌ల్ల‌నే నిహారిక‌కి ఆమె భ‌ర్త‌ విడాకులు ఇచ్చాడా..!
Film News

Niharika Konidela: అత్తగారింట్లో ఇలా చేయ‌డం వ‌ల్ల‌నే నిహారిక‌కి ఆమె భ‌ర్త‌ విడాకులు ఇచ్చాడా..!

Niharika Konidela: ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిహారిక‌కి అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి జ‌రిపించాడు నాగ‌బాబు. కాని పెళ్లైన రెండేళ్ల‌కే విడాకులు తీసుకొని త‌న భ‌ర్త నుండి విడిపోయింది నిహారిక‌. కొన్నాళ్లుగా నిహారిక విడాకుల‌కి సంబంధించి వార్త‌లు వ‌స్తుండ‌గా, జూలై 5న త‌మ విడాకుల‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.విడాకుల ప్ర‌కట‌న త‌ర్వాత సోషల్ మీడియాలో ఎవరికి కావల్సినట్టుగా వారు కథలు అల్లేసుకున్నారు. ఏవేవో ప్ర‌చారాలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ కాని..చైతూ ఫ్యామిలీ కూడా ఈ విడాకుల విషయంలో స్పందించలేదు.

 

ఇటీవ‌ల చైతన్య తండ్రి.. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ నిహారిక గురించి, ఆమె ప్ర‌వ‌ర్తన గురించి సంచలన విషయాలు వెల్లడించినట్టు సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప‌లు మీడియా సంస్థ‌ల‌లోను ఈ క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఆ వార్తల ప్రకారం.. చైతన్య తండ్రి ప్రభాకర్‌రావు తన సన్నిహితుల ద‌గ్గ‌ర నిహారికి గురించి చెబుతూ.. తాను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నప్పటికీ నిహారిక ఇంట్లో ఎవ‌రితో కూడా ఒక్క రోజు గౌరవంగా ఉండలేదట భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన ఆమెకి లేదని, భర్తను, అత్త మామలను గౌరవించడం తెలియదని,కనీసం ఎప్పుడూ తన భర్త పై ప్రేమ చూపించలేదని, ప‌బ్బులు, క్ల‌బ్బులు అంటూ తెగ తిరిగేసేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే నిహారిక అప్ప‌ట్లో ఓ ఇంట‌ర్వ్యూలో త‌న అత్త మామ‌ల ఇంట్లో ఎలా ఉండేదో చెప్పుకొచ్చింది. ఇదే విడాకుల‌కి కార‌ణ‌మా అని కొత్త చ‌ర్చ మొద‌లైంది. నిహారిక మాట్లాడుతూ…నేను చాలా అల్లరి పిల్లని ..మా ఇంట్లో వాళ్ళు నన్ను భరించలేక భరిస్తున్నారు. పుట్టింట్లో ఎలాగైతే ఉన్నానో అత్తింట్లో కూడా అలాగే ఉన్నాను. మా అత్తయ్య మామయ్య నన్ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. నాకు ఆకలేస్తుంది అంటే మా అత్తమ్మ వచ్చి నాకు తినిపిస్తుంది . ఆవిడ చాలా సరదాగా ఉంటారు. నువ్వు మా చైతన్యను చూసుకో నిన్ను మేము చూసుకుంటాం అనేవారు . మా ఇంట్లో నేను ప‌ది గంట‌ల‌కి నిద్ర లేచే దాన్ని . అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు తలుపు కొట్టి మరీ నన్ను నిద్రలేపేవారు ..కానీ మా అత్తగారింట్లో అలాంటి ప్రాబ్లమే లేదు.. తలుపు కూడా కొట్టరు. నాకు ఇష్టం వచ్చినంత సేపు పడుకొనిస్తారు. ఈ విషయంలో మాత్రం మా అత్త గారికి కాళ్ళు మొక్కాలి అని చెప్పుకొచ్చింది. అయితే నిహారిక‌కి అంత ఫ్రీడ‌మ్ ఇచ్చిన కూడా స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింది అని కొంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...