Home Film News Pooja Hegde: పూజా హెగ్డే సూసైడ్ చేసుకుందా.. ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిందంటూ వార్త‌లు
Film News

Pooja Hegde: పూజా హెగ్డే సూసైడ్ చేసుకుందా.. ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిందంటూ వార్త‌లు

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఒక ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింద‌ని క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ వార్త‌లు చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బాగానే ఉన్న పూజా హెగ్డే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌మేంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ పుకారు పుట్టించింది మరెవ‌రో కాదు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సైంధు . ఆయ‌న ట్వీట్ లో పూజా హెగ్డే గత కొన్ని నెలల నుంచి డిప్రెషన్ కి గురైందని.. మరీ ముఖ్యంగా రెండు వారాల నుంచి తీవ్ర డిప్రెషన్ కి గురైంద‌ని అన్నాడు.

ఆమె త‌నని తాను కంట్రోల్ చేసుకోలేక ఆత్మ‌హ‌త్య‌ చేసేందుకు ప్రయత్నించింది అని..టైంకి తన పేరెంట్స్ గమనించి సమయానికి ఆసుప‌త్రికి తీసుకెళ్లారని ..దీంతో ప్రాణాపాయం తప్పిందని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. కొద్ది రోజులుగా ఉమైర్ సంధు త‌ప్పుడు ట్వీట్స్ చేస్తూ అంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై ప‌డేలా చేస్తున్నాడు. పూజ హెగ్డే క‌నుక త్వ‌ర‌గా ఈ వార్త‌ల‌పై స్పందించకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే అవకాశం ఉంది అంటున్నారు ఆమె అభిమానులు. ఇటీవ‌ల ఉమైర్ .. అన‌న్య పాండే ప‌ట్ల కూడా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.ఆమె ఓ హీరోతో విదేశాల‌కి వెళ్లి అక్క‌డ క‌డుపు కూడా చేయించుకునేలా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 

ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసిన పూజా హెగ్డే ఇప్పుడు కాస్త స్లో అయిన‌ట్టు క‌నిపిస్తుంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ నలుగురు స్టార్ హీరోలతో నాలుగు బడా డిజాస్టర్లను సొంతం చేసుకున్న పూజా హెగ్డేకి ఇప్పుడు ఒక్క అవ‌కాశం కూడా లేదు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో నటిస్తుంది అన్న ఆశలైనా ఉండేవి. కాని అది కూడా చేజారిపోయింద‌ని స‌మాచారం. అయితే ఈ అమ్మ‌డు కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు బిజినెస్‌లు చేసిందని వాటితో పూజా బాగానే సంపాదిస్తుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...