Home Film News Samantha: రాష్ట్ర‌ప‌తిని క‌లిసి స‌మంత‌.. కార‌ణం ఏంటంటే..!
Film News

Samantha: రాష్ట్ర‌ప‌తిని క‌లిసి స‌మంత‌.. కార‌ణం ఏంటంటే..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో పాటు హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కి కూడా సైన్ చేసిన విష‌యం విదిత‌మే. చివ‌రిగా శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ఖుషీ అనే చిత్రంతో పాటు సిటాడెల్ అనే చిత్రం చేస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటోంది. రాజ్- డీకే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెర్బియా మంచుకొండల్లో చిత్రీకరిస్తోంది యూనిట్. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు గ‌త కొద్ది రోజులుగా సెర్బియాలోనే ఉంటున్నారు.

ఇదే క్ర‌మంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రస్తుతం సెర్బియా పర్యటనలో ఉన్నారు. ఆ స‌మ‌యంలో సిటాడెల్ టీంకి అక్కడ ద్రౌపతి ముర్ముని కలసి అవకాశం ద‌క్కింది. వరుణ్ ధావన్, సమంత ఇతర సిటాడెల్ టీం రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముని కలసి కొద్ది సేపు ముచ్చటించారు. ఆమెతో క‌లిసి తీసుకున్న ఫొటోస్ ని వరుణ్ ధావన్, సమంత సోషల్ మీడియాలో షేర్  చేయ‌డంతో కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అయింది.  గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ని కలిసే అవకాశం మాకు ద‌క్కింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప ఆనందాన్ని గౌరవాన్ని ఇచ్చింది అంటూ వ‌రుణ్ ధావన్ త‌న పోస్ట్‌లో తెలిపారు.

భారత్- సెర్బియా మధ్య ఉన్న దౌత్యసంబంధాలను  బలోపేతం చేసుకోవడంలో భాగంగా ముర్ముఈ పర్యటన చేపట్టారు. బెల్‌గ్రేడ్‌లో మ‌న రాష్ట్ర‌ప‌తికి ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన ో కార్యక్రమంలో సైనిక వందనాన్ని ద్రౌపది ముర్ము స్వీకరించారు. ఇక సిటాడెల్ విష‌యానికి వ‌స్తే..  ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి  ప్రీక్వెల్ గా ఇది రూపొందుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు చాలా బోల్డ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...