Home Film News Nayanthara: న‌య‌న‌తార‌- విఘ్నేష్ ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. తొలిసారి పిల్ల‌ల‌ని ప‌రిచ‌యం చేసిన లేడి సూప‌ర్ స్టార్
Film News

Nayanthara: న‌య‌న‌తార‌- విఘ్నేష్ ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. తొలిసారి పిల్ల‌ల‌ని ప‌రిచ‌యం చేసిన లేడి సూప‌ర్ స్టార్

Nayanthara: ప్రేమలో ప‌లుమార్లు మోస‌పోయిన న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు విఘ్నేష్ శివ‌న్‌తో ఏడ‌డుగులు వేసిన విష‌యం తెలిసిందే. గత సంవత్సరం జూన్‌ 9న వీరిద్దరు మహాబలిపురంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అనంత‌రం స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చారు. అయితే కొన్నాళ్లుగా త‌మ పిల్ల‌ల ఫేస్ క‌న‌ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ఈ జంట త‌మ వెడ్డింగ్ యానివర్స‌రీ సంద‌ర్భంగా ప్ర‌పంచానికి పిల్ల‌లిద్ద‌రిని ప‌రిచ‌యం చేశారు. నయనతార ఫొటోస్ షేర్ చేసిన‌ విగ్నేష్ శివన్ త‌న పోస్ట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా జీవితానికి మూలం నువ్వే. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ తో సంతోషంగా గడిచింది. అనేక ఎత్తుపల్లాలు మ‌న‌కు ఎదురయ్యాయి. ఊహించని ఎదురుదెబ్బలు కూడా తగిలాయి.

కఠిన పరీక్షలు కూడా ఎదుర్కొన్నాం.ఎన్ని కష్టాలు ఎదురైన‌ప్ప‌టికీ ఇంటికి తిరిగొచ్చి నా అందమైన ఫ్యామిలీని చూస్తే కోల్పోయిన ఎనెర్జీ మొత్తం మ‌ళ్లీ వ‌చ్చేస్తుంది. కలలు సాకారం చేసుకునే కాన్ఫిడెన్స్ తిరిగి పొందిన‌ట్టు అనిపిస్తుంది.. ఫ్యామిలీ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లేవ‌ల్‌లో ఉంటుంది అని విగ్నేష్ శివన్ చాలా ఎమోషనల్ కామెంట్స్ పెట్టారు. అయితే ఫొటోలలో నయనతార తన ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగమ్ ని ఎత్తుకుని ఎంతో క్యూట్‌గా పోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం వారి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక నెటిజన్లు, అభిమానులు నయన్, విగ్నేష్ కి ఫస్ట్ మ్యారేజ్ యానవర్సరీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

 

పెళ్లి తరువాత నయనతార‌, విఘ్నేశ్ శివన్ దంప‌తులు తిరుమలలో స్వామి వారి దర్శనానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ మాఢవీధుల్లో నయన్ చెప్పులతో నడవడం, గుడి ముందే ఫోటో షూట్లు చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.ఈ క్ర‌మంలో తాను తెలిసి ఆ తప్పు చేయలేదని, అనుకోకుండా జరిగిందని, అందరూ తమను క్షమించాలని అభ్యర్థిస్తూ విఘ్నేశ్ శివన్ ఓపెన్ లెటర్ విడుద‌ల చేశారు. ఇక స‌రోగ‌సి ద్వారా న‌య‌న‌తార దంప‌తులు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం ప‌ట్ల కూడా కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆ స‌మ‌యంలో ఆ వివాదం కూడా కూల్‌గా సాల్వ్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార.. షారూఖ్ ఖాన్ న‌టిస్తున్న‌జ‌వాన్ అనే సినిమాలో న‌టిస్తుంది.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...