Home Film News Suma Rajeev: ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ.. సుమ‌ని లేపుకుపోదామ‌ని అనుకుంటే…
Film News

Suma Rajeev: ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ.. సుమ‌ని లేపుకుపోదామ‌ని అనుకుంటే…

Suma Rajeev: ఇండ‌స్ట్రీలో కొన్ని చూడ‌ముచ్చ‌టైన జంట‌లు ఉన్నాయి. ఎన్ని గొడ‌వ‌లు వచ్చిన, ఎన్ని స‌మ‌స్య‌లు వారిని చుట్టుముట్టిన కూడా వారు విడాకుల వ‌ర‌కు వెళ్లకుండా వారి వైవాహిక జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాంటి జంట‌ల‌లో సుమ‌- రాజీవ్ క‌న‌కాల జంట త‌ప్ప‌కుండా ఉంటుంది. ఈ ఇద్ద‌రు ప్రొఫెష‌న‌ల్‌ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. రాజీవ్ క‌న‌కాల సిల్వ‌ర్ స్క్రీన్‌పై తెగ సంద‌డి చేస్తుండ‌గా, సుమ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్ద‌రు విడిపోయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం న‌డిచింది. దానికి వారు పులిస్టాప్ పెట్టే ప్ర‌య‌త్నాలు చేసిన కూడా అవి ఆగ‌డం లేదు.

తాజాగా  శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ‘భాగ్ సాలే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ‌, రాజీవ్ క‌న‌కాల అన్యోన్య‌త‌ని చూసి వారిరివురు సంతోషంగా ఉన్నార‌ని ప్ర‌తి ఒక్కరు భావించారు. ఇక ఇదే వేదిక‌పై రాజీవ్ క‌న‌కాల త‌మ ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  ‘భాగ్ సాలే’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజీవ్  స్టేజ్‌పైకి రాగానే సినిమా టైటిల్‌కు సంబంధించిన క్లారిటీ ఇస్తూ త‌న లైఫ్‌లో జ‌రిగిన ‘భాగ్ సాలే’ మూమెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

సుమ‌ను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు  మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. అయితే వాళ్లింట్లో ఒప్పుకోలేదు. దాంతో సుమ‌ను లేవ‌దీసుకుని పోయే ప్లాన్ చేశాను. ఈ విష‌యం సుమ‌కి కూడా చెప్పాను. ముందు రోజు రాత్రి వారాసిగూడ‌లో పారిపోవ‌టానికి ఒక  బైక్ కూడా రెడీగా పెట్టుకొని..యాద‌గిరిగుట్ట‌కు వెళ్లి పెళ్లి చేసుకోవాలా! మా అమ్మ‌నాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్లాలా? అని ఎన్నో ఆలోచ‌న‌లు చేశాను. మ‌రుస‌టి రోజు సుమ ఫోన్ చేసి మన పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నార‌ని చెప్ప‌టంతో సైలెంట్ అయిపోయాను’’ అని తన లవ్‌స్టోరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్  చెప్పుకొచ్చారు రాజీవ్ క‌న‌కాల‌. త్వ‌ర‌లో సుమ‌- రాజీవ్ క‌న‌కాల దంప‌తులు తమ కుమారుడిని ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...