Home Film News Priyadarsini Ram: బాల‌కృష్ణ మంచిత‌నం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన ప్రియ‌ద‌ర్శిని రామ్
Film News

Priyadarsini Ram: బాల‌కృష్ణ మంచిత‌నం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన ప్రియ‌ద‌ర్శిని రామ్

Priyadarsini Ram: నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న ఇప్పుడు రాజ‌కీయాల‌లోను రాణిస్తున్నారు. బాల‌కృష్ణ చాలా కోపిష్టి అని చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని ఒక్కొక్క‌రు ఒక్కో మాదిరి చెబుతుంటారు. బాల‌కృష్ణ‌ది ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం. ఎవ‌రికి ఏ సాయం వ‌చ్చిన కూడా వెంట‌నే స్పందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉంటారు. అయితే తాజాగా బాల‌కృష్ణ గురించి  ప్రియదర్శిని రామ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప్రియ‌ద‌ర్శిని ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా మీడియాలోను తన స‌త్తా చూపించారు.

తాజాగా ఆయ‌న ఓ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.   వైఎస్ జగన్ కుటుంబంతోనే కాకుండా బాలకృష్ణతో కూడా తాను ఎంతో  సన్నిహితంగా ఉంటానని వెల్ల‌డించారు. బాలకృష్ణ తన జూనియర్ అయినప్ప‌టికీ,  బాలయ్యను తాను అన్న అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఒక‌సారి బాల‌కృష్ణ‌కి సాయం కోసం తాను మెసేజ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.
బాలకృష్ణ పసి బిడ్డ లాంటి వారని.. ఒకసారి ఎయిర్ పోర్ట్ లో లగేజ్ పట్టుకుని వెళ్తుంటే.. దూరం నుంచి గుర్తుపట్టి బాక్సీ అని తాను పిలిచిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.  కాలేజ్ లో ఉన్నప్పుడు తాను ఎక్కువ‌గా బాక్సింగ్ చేయ‌డం వ‌ల‌న త‌న‌ని బాక్సీ అని పిలిచేవారని అన్నారు. ఎయిర్ పోర్ట్ లో ఓ సారి తనను  గుర్తుపట్టి బాక్సీ అని పిలిచారని.. అప్పుడు ఆయ‌న‌ను ఎవరో ఫోటో అడిగితే బాలకృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని, బాల‌య్య‌కి  ఫోటో దిగడం  ఏ మాత్రం ఇష్టం ఉండదని ప్రియదర్శిని అన్నారు.

సినిమా న‌టుల‌తో కాదు పేరేంట్స్ తో ఫొటోలు దిగాల‌ని బాల‌య్య అనే వారు.ఓసారి  బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పేద పూజారికి సర్జరీ జర‌గగా, ఆయ‌న న‌న్ను డిస్కాంట్ కావాల‌ని అడిగారు. అప్పుడు నాకు అంత శ‌క్తి లేద‌ని చెప్పి బాల‌య్య‌కి మెసేజ్ పెట్టాను. మీ ఆసుప‌త్రిలో పూజారికి స‌ర్జ‌రీ జ‌రిగింది. డిస్కౌంట్ అడుగుతున్నారు అని చెప్ప‌గా, అప్పుడు బాల‌య్య‌.. ఆ ఆసుప‌త్రి నీది. న‌న్ను ఎందుకు అడుగుతున్నావ్. నీ క‌న్నా చిన్న‌వాడిని నేను. అన్న అని ఎందుకు అంటున్నావు. డిస్కౌంట్ గురించి న‌న్ను అడ‌గాలా చెప్పు అని అన్నార‌ని ప్రియ‌ద‌ర్శి చెప్పుకొచ్చారు. బాల‌య్య మంచి మనిషి, చాలా గొప్పోడు అని కూడా ప్రియ‌ద‌ర్శిని అన్నారు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...