Home Film News Niharika: ఎట్ట‌కేల‌కు నిహారిక- చైత‌న్య విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. వారి విడాకుల‌కి కార‌ణ‌మిదే..!
Film News

Niharika: ఎట్ట‌కేల‌కు నిహారిక- చైత‌న్య విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. వారి విడాకుల‌కి కార‌ణ‌మిదే..!

Niharika: మెగా కుటుంబంలోఇటీవ‌ల వ‌రుస విడాకులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. శ్రీజ ఇద్ద‌రు భ‌ర్త‌ల‌కి విడాకులు ఇవ్వ‌గా, నాగబాబు కుమార్తె నిహారిక కూడా  త‌న‌ వైవాహిక బంధానికి ముగింపు పలికిందంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. అయితే ఇన్ని రోజుల వ‌ర‌కు దీనిపై ఎవ‌రు స్పందించిది లేదు.ఎప్పుడైతే  నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చేశారో .. అలానే  తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసాడో వీరి విడాకుల‌పై నెటిజన్లలో అనుమానాలను రేకెత్తాయి.

ఆ మ‌ధ్య చైత‌న్య త‌న  తల్లిదండ్రులతో కలిసి చైతన్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ల‌గా,ఆ స‌మ‌యంలో  కూడా ఆయన వెంట నిహారిక లేదు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన‌ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలోనూ నిహారిక ఆమె భర్తతో కనిపించలేదు. ఇంటి అల్లుడు అయ్యి ఉండి బామ్మర్ది ఎంగేజ్‌మెంట్‌కు రాలేదంటే నిహారిక-చైతన్య జొన్నలగడ్డలు విడాకులు తీసుకొని ఉంటార‌ని అంద‌రు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ అనుమానాల‌కి పులిస్టాప్ ప‌డింది.   జొన్నలగడ్డ వెంకట చైతన్య  నుంచి త‌న‌కు విడాకులు కావాలని నిహారిక  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే హిందూ చట్ట ప్రకారం నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. గ‌త నెల 5న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్యలు చేసిన దరఖాస్తు ఇప్ప‌డు  బయటకు రావడంతో  వారిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు క‌న్‌ఫాం అయింది. అయితే అస‌లు వారి విడాకుల‌కి కార‌ణం నిహారికనే అంటున్నారు. ఈ అమ్మడు అప్పుడు ప‌బ్ ఇష్యూతో దొర‌క‌డం, ఆ త‌ర్వాత అపార్ట్‌మెంట్ వారితో గొడ‌వ‌ప‌డ‌డం ప్ర‌ధాన కార‌ణాల‌ని ఇప్పుడు ప‌లువురు చెప్పుకొస్తున్నారు. మ‌రి ఈ ఇష్యూపై నాగ‌బాబు ఏమైన స్పందిస్తాడా అన్న‌ది చూడాలి. ఇక  వెంకట చైతన్య జొన్నలగడ్డ .. నిహారిక‌తో ఆగస్టు 13, 2020  నిశ్చితార్థం జరుపుకున్నాడు.. ఇక  అదే ఏడాది డిసెంబర్ 9న   రాజస్థాన్, ఉదయ్‌పూర్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో జరిగిన విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...