Home Film News Renu Desai: ప‌ద‌కొండేళ్లుగా న‌ర‌కం చూస్తున్నాను.. రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
Film News

Renu Desai: ప‌ద‌కొండేళ్లుగా న‌ర‌కం చూస్తున్నాను.. రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

Renu Desai: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన బద్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ స‌మ‌యంలోనే అత‌నితో ప్రేమ‌లో ప‌డింది రేణూ దేశాయ్. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి అనంత‌రం పెళ్లి చేసుకున్నారు. వీరి దాంప‌త్యంలో అకీరా, ఆద్య అనే ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు.  పిల్ల‌లు పుట్టాక ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణూ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తలెత్త‌డంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ త‌న భ‌ర్త‌కి  దూరంగా  పిల్ల‌ల‌తో పూణేలో ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో  రేణూ దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ పోషించే రేణూ దేశాయ్ రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి పాజిటివ్ కామెంట్ చేయ‌డంతో ఆమె యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

రేణూదేశాయ్‌కి ప‌వ‌న్ ఫ్యాన్స్ నుండో లేదంటే ఆమె యాంటీ ఫ్యాన్స్ నుండో ఎప్పుడు ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. తనని మోసం చేశాడని, తనతో ఉంటూనే ఇంకో అమ్మాయితో బిడ్డను కన్నాడని ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేసి విమ‌ర్శ‌ల పాలైంది. ఇక  పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, సమాజం కోసం వచ్చాడని, ఆయనకే నా మద్దతు ఉంటుందని  ఇటీవ‌ల రేణూ దేశాయ్ కామెంట్ చేయ‌గా, దానిపై కొంద‌రు యాంటీ ఫ్యాన్స్ రేణూ దేశాయ్‌ని తెగ తిట్టిపోస్తున్నారు.. ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్ రేణూ దేశాయ్‌కి ఉచిత స‌ల‌హ ఇచ్చాడు.

మీరు ఈ విష‌యంపై ఎంత‌ వరకు  స్పందిస్తూ ఉంటారో.. అంత వరకు ఇలాంటి నెగెటివ్ కామెంట్లు త‌ప్ప‌క‌ వస్తూనే ఉంటాయి.. జనాలు వాటి గురించి  మాట్లాడుతూనే ఉంటారు.. మీరు కామ్‌గా ఉండండి.. ఏదైనా ఇంకా పెద్దగా సక్సెస్ సాధించండి.. అప్పుడే ఈ జనాలు మీ గతం గురించి మాట్లాడకుండా ఉంటారని,  మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే.. ఈ పనే చేయండి అంటూ ఆ నెటిజ‌న్.. రేణూ దేశాయ్‌కి ఉచిత సలహా ఇచ్చాడు. అందుకు స్పందించిన రేణూ దేశాయ్.. ప‌బ్లిక్ మీటింగ్‌లో ఎప్పుడూ కూడా నా విడాకుల గురించి నేను మాట్లాడలేదు.. నేను మీకు ఇలా ఇన్ స్టాగ్రాంలో మీకు అందుబాటులో ఉంటున్నా కాబ‌ట్టే ఇలా స‌ల‌హాలు ఇస్తున్నారు. నా విడాకుల గురించి ప‌బ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్న వారికి మీరు ఏం స‌ల‌హాలు ఇవ్వ‌లేరా..  నన్ను బాధించే,  విషయాల గురించి నేను ఆలోచించకూడదని చాలా సార్లు అనుకుంటాను.. కానీ  ఈ పదకొండేళ్లలో ప్రతీ క్షణం గుర్తు చేస్తూ నాకు నరకం చూపిస్తూనే ఉన్నారు.. నా లాంటి వాళ్లకు మీలాంటి వాళ్లు సలహాలు ఇవ్వడం చాలా ఈజీనే అంటూ రేణూ దేశాయ్ చాలా ఎమోష‌న‌ల్  కామెంట్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...