Home Film News Rajamouli: కోపం వ‌స్తే ఫోన్ బ‌ద్దలు కొట్టే రాజ‌మౌళి.. ఫోన్ ప్ర‌మోష‌న్ చేశారా..!
Film News

Rajamouli: కోపం వ‌స్తే ఫోన్ బ‌ద్దలు కొట్టే రాజ‌మౌళి.. ఫోన్ ప్ర‌మోష‌న్ చేశారా..!

Rajamouli: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో రాజ‌మౌళి క్రేజ్ ఖండాంత‌రాలు దాటింది. ఇండియన్ సినిమాని 2000 కోట్ల రేంజ్ కి చేర్చిన అతడిని ఇప్పుడు అంద‌రు  ఇండియన్ స్పీల్ బర్గ్ గా పిలుచుకుంటున్నారు. రాజ‌మౌళి క్రేజ్ ఇప్పుడు చాలా మంది ఉప‌యోగించుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు. చాలా మంది అత‌డిని మూవీ ఈవెంట్స్ కి గెస్ట్‌గా పిల‌వ‌డం, త‌మ కంపెనీల‌ను ప్ర‌మోట్ చేయించుకోవ‌డం వంటివి చేస్తున్నారు. రీసెంట్‌గా రాజ‌మౌళి  క్రేజ్ ని ఓ ప్రముఖ ఫోన్ కంపెనీ బ్రాండ్ గా వినియోగించుకుంది.

సదరు ఫోన్ కంపెనీ  రాజ‌మౌళిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇంతవరకూ రాజమౌళి ఎలాంటి ప్రకటనలు చేయలేదు, అందులోను న‌టించ‌లేదు..తొలిసారి ఓ ఫోన్ యాడ్ కోసం రాజ‌మౌళి న‌టించారు. స్టైలిష్ గెట‌ప్ లో రాజ‌మౌళిని చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. అయితే  రాజమౌళి ఇలా ఫోన్ యాడ్ లో నటించడం చూసి ఆయన సన్నిహితులు..స్నేహితులు
ఆశ్చర్యానికి కూడా లోన‌వుతున్నార‌ట‌. అందుకు కార‌ణం రాజ‌మౌళికి కోపం వ‌స్తే అది ఎంత కాస్ట్ లీ ఫోన్ అయిన కూడా  నేల మట్టం కావాల్సిందేనట. కోపం వ‌చ్చిన‌ప్పుడు  ఫోన్ నేలకేసి కొడతారుట. ఆ సమయంలో ఫోన్ ఖరీదు ఎంత ఆయనకు ఏ మాత్రం గుర్తు రాదుట. నేల కేసి కొట్టిన తర్వాత ఆ ఫోన్  పది ముక్కలైన తర్వాత దాని ధర గురించి ఆరాలు తీస్తార‌ట‌.

అయితే ఫోన్ అలా ప‌గ‌ల‌గొట్టే రాజ‌మౌళి ఇలా  ఫోన్ కంపెనీని ప్రమోట్ చేయడం యాదృశ్చికం. అయితే ఈ యాడ్ ని ఆయన‌ సోషల్ కాజ్ కోసం చేసిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రాజ‌మౌళి నీలోఫర్ ఆసుపత్రిలో  కొందరు చిన్న పిల్లల బాధ్యత తీసుకుంటానని ప్రామిస్ చేసారు. అందుకోసమే రాజమౌళి ఇలా ఆ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు తెలుస్తుంది.  ఆ ప్ర‌క‌ట‌న‌ ద్వారా వచ్చే డబ్బును పిల్లల అనారోగ్యానికి ఆయ‌న ఖర్చు చేయనున్నట్లు  తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ సినిమాపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...