Home Film News Shreya Daughter: శ్రియ కూతురు అప్పుడే అంత పెద్ద‌ద్దైందా.. స్కూల్‌కి కూడా పంపిస్తున్నారుగా..!
Film News

Shreya Daughter: శ్రియ కూతురు అప్పుడే అంత పెద్ద‌ద్దైందా.. స్కూల్‌కి కూడా పంపిస్తున్నారుగా..!

Shreya Daughter: ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేసిన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. స్టార్ హీరోయిన్ చిరంజీవి నుండి చిన్న హీరోల వ‌ర‌కు కూడా త‌ను న‌టించి అల‌రించింది. తెలుగులో దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన ఈ భామ‌ ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక 2018లో త‌న ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అత‌నితో ప్ర‌స్తుతం సంతోషంగా గ‌డుపుతుంది. ఇటీవ‌ల శ్రియ ఈ మధ్యనే ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే ఆ విష‌యాన్ని బయటికి కూడా రానీకుండా 365 రోజులు దాచేసింది. అయితే కూతురు పుట్టిన‌ట్టు చెప్పిన త‌ర్వాత శ్రియ ఎక్కువ‌గా త‌న కూతురితోనే క‌నిపిస్తుంది.

2020 లోనే శ్రియ ఓ పాపకు జన్మనివ్వ‌గా, ఏడాది త‌ర్వాత ఈ విష‌యాన్ని చెప్పుకొచ్చింది. స్పెయిన్‌లోని బోర్సిలోనాకి వెకేషన్ కు వెళ్లిన శ్రియ దంపతులు.. లాక్ డౌన్ కారణంగా అక్క‌డే ఇరుక్కుపోయారు. ఏడాది పాటు అక్కడే ఉన్నారు. అదే సమయంలో పండంటి పాపకు జన్మనిచ్చింది శ్రియ.ఇక ఈ పాపకు రాధా అనే పేరు పెట్టింది శ్రియ. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం రష్య‌న్‌లో రాధా అంటే సంతోషం అని అర్థం వస్తుంది అని చెప్పుకొచ్చింది. అలాగే పాప పుట్టిందని విషయాన్ని తన అమ్మకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే రాధా రాణి వచ్చింది అంటూ చెప్పుకొచ్చిందని,  అదే విషయం తన భర్తకు చెప్తే రాధా పేరు పెట్టేద్దాం అని తెలిపార‌ని శ్రియ పేర్కొంది.

ఇప్పుడు రాధా చాలా పెద్ద‌గా అయింది. అయితే కుమార్తె రాధ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే  శ్రియ..తాజాగా రాధ స్కూల్ కి వెళుతున్న ఫొటోస్ కొన్ని షేర్ చేసింది. కరోనా స‌మ‌యంలోనే జ‌న్మించిన రాధా అప్పుడే పెరిగి పెద్ద‌దై స్కూల్‌కి కూడా వెళుతుందా అని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు చిన్నారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌ల శ్రియ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నటించిన చిత్రాలను తన కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత చూసి గర్వపడాలని అనుకుంటున్నాన‌ని శ్రియ తెలియ‌జేసింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...