Home Film News Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత అశ్వినీ దత్..
Film News

Project K : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత అశ్వినీ దత్..

Project K
Project K

Project K: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా.. హను రాఘవపూడి డైరెక్షన్లో, వైజయంతి మూవీస్ నిర్మించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’..

సుమంత్, రష్మిక మందన్న ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. గతకొద్ది రోజులుగా టీం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీ దత్ మాట్లాడుతూ.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘సీతా రామం’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

అలాగే ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో.. తమ సంస్థ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ సినిమాకి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటార్‌గా వర్క్ చేస్తున్నారు.

అశ్వినీ దత్ మాట్లాడుతూ.. ‘‘‘ప్రాజెక్ట్-K’ కచ్చితంగా అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాతో చైనా, అమెరికా లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం.. ఇది ‘ఎవెంజర్స్’ టైప్ సినిమా.. 2023 జనవరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేస్తాం.. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్‌కి 8 నెలలు టైం పడుతుంది. 2023 అక్టోబర్ 18 లేదా 2024 జనవరిలో విడుదల చేస్తాం’ అన్నారు.

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-K’, ‘స్పిరిట్’ సినిమాలున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...