Home Film News Controversial Hero: షాకింగ్ న్యూస్ చెప్పిన కాంట్ర‌వ‌ర్సియ‌ల్ హీరో..ఆగ‌స్ట్ 15న పూర్తి వివ‌రాలు చెబుతానంటూ ట్వీట్
Film News

Controversial Hero: షాకింగ్ న్యూస్ చెప్పిన కాంట్ర‌వ‌ర్సియ‌ల్ హీరో..ఆగ‌స్ట్ 15న పూర్తి వివ‌రాలు చెబుతానంటూ ట్వీట్

Controversial Hero: టాలీవుడ్‌లో కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా  ఉండే హీరోల‌లో విశ్వక్ సేన్ ఒక‌రు. మాస్ కా దాస్ అని అభిమానుల‌తో పిలిపించుకుంటున్న హీరో వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. విశ్వక్ సేన్ చేసిన చిత్రాల‌లో కొన్ని మంచి విజ‌యాలు సాధించ‌గా, మ‌రి కొన్ని పూర్తిగా నిరాశ‌ప‌రిచాయి. అయితే విశ్వ‌క్ సేన్ ఇటీవ‌ల వివాదాల‌త ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఆ మ‌ధ్య టీవీ 9 యాంక‌ర్ తో స్టూడియోలోనే గొడ‌వ పెట్టుకున్న విశ్వ‌క్ సేన్.. బేబి ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌తో కూడా కోల్డ్ వార్ న‌డిపించాడు. మొత్తానికి కాంట్ర‌వ‌ర్షియ‌ల్ హీరో అని పేరు తెచ్చుకున్న విశ్వ‌క్..తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఓ షాకింగ్ విష‌యం చెప్పాడు.

త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో విశ్వ‌క్ సేన్.. ఇన్ని రోజుల‌ నుంచి నా పై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని భావిస్తున్నాను. నేను  నా జీవితంలోని మరో ఘటాన్ని ప్రారంభించాల‌ని అనుకుంటున్నాను.  నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను అని విశ్వ‌క్ సేన్ త‌న పోస్ట్ లో పేర్కొన్నాడు. విశ్వక్ సేన్ పోస్ట్ చూస్తుంటే ఇదేదో పెళ్లి వార్త మాదిరిగా ఉంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ అనుకుంటున్నారు.  మాస్ కా దాస్ ని వరించబోయే అమ్మాయి ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌దా, లేకుంటే తెలిసిన వాళ్ల‌మ్మ‌యా అంటూ ప‌లు చ‌ర్చ‌లు చేస్తున్నారు. ఏదేమైన దీనిపై క్లారిటీ రావాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

ఇక విశ్వ‌క్ సేన్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన గామి షూటింగ్ పూర్తి  కాగా, ఇప్పుడు పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.ఇక  ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా కనిపించి అల‌రించ‌బోతున్నాడు.ఆయ‌న స‌ర‌స‌న‌ చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. ఇక  VS10 చిత్రం కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో VS11 ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ తో రా అండ్ రస్టిక్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. ఇందులో పూర్తి మాస్ లుక్‌తో అల‌రించ‌బోతున్నాడు. ఇందులో  అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా  క‌నిపించ‌నున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...