Home Film News Adi Marriage: మ‌రోసారి వార్త‌ల‌లోకి ఆది పెళ్లి.. మా అమ్మ‌ని అడ‌గాలంటున్న యాంకర్
Film News

Adi Marriage: మ‌రోసారి వార్త‌ల‌లోకి ఆది పెళ్లి.. మా అమ్మ‌ని అడ‌గాలంటున్న యాంకర్

Adi Marriage: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకొని ఇప్పుడు న‌టుడిగా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు హైప‌ర్ ఆది. ఈయ‌న పెళ్లి గురించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. కాని వాటిపై ఎలాంటి క్లారిటీ రావ‌డం లేదు. ఇటీవ‌ల ప్ర‌ముఖ యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌తో అని చాలా పుకార్లు వ‌చ్చాయి. దీనిపై అటు ఆది కాని ఇటు వ‌ర్షిణి కాని స్పందించ‌క‌పోయే స‌రికి వీరిద్ద‌రు నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనే అనుమాలు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే వ‌ర్షిణి తాజాగా స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

యాంక‌ర్ వ‌ర్షిణి..   `ఢీ` షోలో ఆదితో క‌లిసి  సందడి చేసింది. వీరు ఇద్దరు పులిహోర కలుపుకుంటూ తెగ ర‌చ్చ  చూశారు. అటు వర్షిణి, ఇటు ఆది బాగానే పులిహోర కలుపుతూ ఆడియ‌న్స్‌కి మంచి వినోదం పంచారు..అయితే షో కోస‌మే వారిద్ద‌రు పులిహోర క‌లుపుతున్న‌ట్టు తెలిసిన బ‌య‌ట కూడా వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి ఈ క్ర‌మంలో  ఆది, తాను మంచి ఫ్రెండ్స్ అని. ఎప్ప‌టికీ  తాను పెళ్లి చేసుకోనని,   ప్రేమలో ఓడిపోయిన నేను పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే ఇటీవ‌ల వారిద్ద‌రికి సంబంధించిన పుకార్లు ఎక్కువ కావ‌డంతో వ‌ర్షిణి మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది.

రీసెంట్‌గా త‌న  అభిమానులతో వర్షిణి ముచ్చటించగా, అందులో ఆమెకి పెళ్లి ప్రశ్నలే ఎదురయ్యాయి. హైపర్‌ ఆదితో పెళ్లి ఎప్పుడూ అని ప్రశ్నించ‌గా, తాను స్పందిస్తూ.. నాకు చాలా రోజులుగా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయని, మొదట వాటికి తాను రియాక్ట్ కాకూడదని అనుకున్నానని చెప్పింది. కాని త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో అవ్వక తప్పడం లేదని, ఒక్కసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాను రియాక్ట్ అవుతున్నట్టు పేర్కొంది. త‌నపై వ‌స్తున్న పెళ్లి వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేదు. అలాంటి ఆలోచ‌న ఏ మాత్రం లేద‌ని పేర్కొంది వ‌ర్షిణి . ఇక ఓ నెటిజ‌న్ మనం పెళ్లి చేసుకుందామని అడగ‌డంతో, ఈ విషయాన్ని మా అమ్మని అడగాలి అని క్యూట్ ఆన్స‌ర్ ఇచ్చింది వ‌ర్షిణి.  మొత్తానికి త‌న రిప్లైతో ఆదితో ఆమెకి  ఎలాంటి రిలేషన్ లేదని అర్ధ‌మైంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...