Home Film News Sammathame Trailer : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..
Film News

Sammathame Trailer : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..

Sammathame Trailer
Sammathame Trailer

Sammathame Trailer: ‘రాజావారు రాణిగారు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తో యాక్టర్‌గానే కాకుండా రైటర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మూడో సినిమా ‘సెబాస్టియన్’ అంచనాలను అందుకోలేకపోయింది.

ఇప్పుడు ‘సమ్మతమే’ అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గురువారం ‘సమ్మతమే’ థియేట్రికల్ ట్రైలర్ KTR రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని మూవీ టీంకి విషెస్ తెలియజేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కిరణ్ అబ్బవరం తన స్టైల్ ఆఫ్ యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. కిరణ్, చాందిని చౌదరిల కెమిస్ట్రీ బాగుంది. క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు. డైలాగ్స్, విజువల్స్, సాంగ్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ అలరించే విధంగా ఉన్నాయి. జూన్ 24న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీత ఫిలింస్ ‘సమ్మతమే’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...