Home Film News Allu Arjun – Sai Pallavi : ‘ఐకాన్ స్టార్’ లానే ‘లేడీ పవర్‌స్టార్’.. సాయి పల్లవి రేంజ్ మార్చేసిన సుకుమార్..
Film News

Allu Arjun – Sai Pallavi : ‘ఐకాన్ స్టార్’ లానే ‘లేడీ పవర్‌స్టార్’.. సాయి పల్లవి రేంజ్ మార్చేసిన సుకుమార్..

Allu Arjun - Sai Pallavi
Allu Arjun - Sai Pallavi

Allu Arjun – Sai Pallavi: సాయి పల్లవి.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. అంతేకాదు.. వండర్ ఫుల్ డ్యాన్సర్ కూడా.. సినిమాల్లోకి రావడానికి ముందే డ్యాన్స్‌తో స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. సినిమాల్లోకి వచ్చాక తన పర్ఫార్మెన్స్‌తో పాటు డ్యాన్స్‌కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది.

మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.. ‘వచ్చిండే’, ‘రౌడీ బేబీ’, ‘ఏవండోయ్ నాని గారు’, ‘సారంగదరియా’.. ఈ సాంగ్స్ అంత బాగా క్లిక్ అవడానికి మెయిన్ రీజన్ సాయి పల్లవే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రానా హీరో అయినా కూడా ముందు నుండి ‘విరాటపర్వం’ సాయి పల్లవి సినిమాగానే టీం చెప్తూ వస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ‘ఐకాన్ స్టార్’ ట్యాగ్ తగిలించిన బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఈమధ్యే సాయి పల్లవికి ‘లేడీ పవర్ స్టార్’ అనే పేరు పెట్టారు. ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఏవీలోనూ ‘లేడీ పవర్ స్టార్’ అనే వేశారు.

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అనే పేరుతో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ‘పుష్ప’ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చి పెట్టింది. పాండమిక్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘విరాట పర్వం’ లో కూడా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి అని టైటిల్ వేస్తారేమో.. సాయి పల్లవి రేంజ్ ఇంకా ఏ రేంజ్‌కెళ్తుందోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...