Home Film News Balakrishna : థమన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో చెప్పిన బాలయ్య.. వీడియో వైరల్
Film News

Balakrishna : థమన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో చెప్పిన బాలయ్య.. వీడియో వైరల్

Balakrishna
Balakrishna

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో.. ఈ సినిమా బాలయ్యకే కాదు.. తెలుగు ఇండస్ట్రీకి కూడా కొత్త ఉత్సాహాన్నిచ్చింది.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఆ జోష్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు బాలయ్య.

గోపిచంద్ మలినేనితో NBK 107 చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘ఫస్ట్ హంట్’ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా చెయ్యబోతున్నారు.

నటుడిగానే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆహ్వానించే వివిధ ప్రైవేట్ పార్టీలకు కూడా అటెండ్ అవుతుంటారు బాలయ్య. 60 ప్లస్‌లోనూ ఆయన ఓపికకీ, ఎనర్జీకి ముచ్చటేస్తుందసలు.

ఇక ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ షో తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి.. హోస్ట్‌గా సరికొత్తగా షోని రక్తికట్టించారు బాలయ్య. ఫస్ట్ సీజన్ అనుకున్నదానికంటే డబుల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో సెకండ్ సీజన్ కోసం తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇంతలో ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ ఎపిసోడ్‌కి బాలయ్య గెస్ట్‌గా వచ్చారు. ప్రోమోలతో పిచ్చెక్కించేశారు. బాలయ్య బర్త్‌డే జూన్ 10న ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చెయ్యగా.. చాలా మంచి స్పందన వచ్చింది. బాలయ్య ఎనర్జీ చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఆ ఎపిసోడ్‌లో అందరి మీద పంచులు వేస్తూ.. నవ్వుతూ.. తెలియని విషయాలు, పొడుపు కథలు చెప్తూ అలరించిన బాలయ్య.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు.‘‘భైరవద్వీపం’ మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడు ఓ చిన్న కుర్రాడు టీషర్ట్ వేసుకుని చిన్న గుండులా.. బంగినిపల్లి మామిడి పండులా ఉన్నాడు.. ఎవరో తెలుసా?’’.. అనగానే.. శ్రీరామ చంద్ర.. ‘థమన్’ అని చెప్పాడు.

థమన్: ‘భైరవద్వీపంతో నా ఎంట్రీ జరిగింది’ అని చెప్పగా… బాలయ్య: ‘అక్కడ మొదలుపెట్టావ్.. ఎక్కడికో వెళ్లి ఆగుతావ్.. ఆగుతావా అసలు?’ అని అడగ్గా.. థమన్: ‘అన్‌స్టాపబుల్.. మీ కోడ్సే’ అని చెప్పాడు. ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసాడు థమన్..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...