Home Film News Chor Bazaar : బాలయ్య వదిలిన బ్లాక్ బస్టర్ ‘చోర్ బజార్’ ట్రైలర్ అదిరిందిగా!
Film News

Chor Bazaar : బాలయ్య వదిలిన బ్లాక్ బస్టర్ ‘చోర్ బజార్’ ట్రైలర్ అదిరిందిగా!

Chor Bazaar Trailer
Chor Bazaar Trailer

Chor Bazaar: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఆంధ్రా పోరి’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత పూరి ‘మెహబూబా’ చేసాడు. మూడో సినిమా ‘రొమాంటిక్’ మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు ఆకాష్‌కి కూడా మంచి పేరొచ్చింది.

ఇప్పుడు ‘చోర్ బజార్’ అనే మూవీ చేస్తున్నాడు. బి.జీవన్ రెడ్డి డైరెక్టర్. జెహ్నా సిప్పీ కథానాయికగా పరిచయమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ నటసింహా నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూవీ షూటింగ్ లొకేషన్‌లో ‘చోర్ బజార్’ ట్రైలర్ లాంఛ్ చేశారు.

ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని, సినిమా మంచి విజయం సాధించి, హీరోగా ఆకాష్‌కి మంచి పేరుతో పాటు నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాలని బాలయ్య అన్నారు. ట్రైలర్ విషయానికొస్తే.. ఆకాష్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ అండ్ ఫైట్స్ చాలా బాగా చేసాడు. హీరోయిన్ క్యారెక్టర్ మాట్లాడకపోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. త్వరలో ‘చోర్ బజార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...