Home Film News ఫిదా న‌టి శ‌రణ్య ప్ర‌దీప్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..ఆమె భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వారే అని తెలుసా..?
Film NewsSpecial Looks

ఫిదా న‌టి శ‌రణ్య ప్ర‌దీప్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..ఆమె భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వారే అని తెలుసా..?

శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌.. ఈ టాలెంటెడ్ న‌టి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా మూవీతో శ‌ర‌ణ్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే త‌న స‌హ‌జ న‌ట‌న‌తో అందరి మ‌న‌సులు గెలుచుకుంది. వ‌రుణ్ తేజ్‌, సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో జంట‌గా న‌టించారు. సాయి ప‌ల్ల‌వి అక్క‌ పాత్ర‌లో శ‌ర‌ణ్య న‌టించింది. ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ లా అల‌రించింది. 2017లో విడుద‌లైన ఫిదా మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ సినిమా త‌ర్వాత శ‌ర‌ణ్య‌ వెండితెర‌పై ఫుల్ బిజీగా మారింది. అయితే న‌టిగా శ‌ర‌ణ్య ప్ర‌దీప్ తెలుగు వారంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. అస‌లు శ‌ర‌ణ్య ప్ర‌దీన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? సినిమాల్లోకి రాక‌ముందు ఏం ప‌ని చేసేది..? ఫిదా మూవీతో అవ‌కాశం ఎలా వ‌చ్చింది..? శ‌ర‌ణ్య భ‌ర్త ఎవ‌రు..? వంటి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇక్క‌డ‌ తెలుసుకుందాం.

Sharanya Pradeep Age, Husband, Family, Biography & More. » StarsUnfolded

1992 మే 17న తెలంగాణలోని నిజామాబాద్ లో ఓ ఉన్న‌త కుటుంబంలో శ‌ర‌ణ్య జ‌న్మించింది. త‌ల్లిదండ్రులు శైలిజ గౌడ్‌, న‌వీన్ గౌడ్‌. శ‌ర‌ణ్య‌కు సౌర‌బ్ అనే బ్ర‌ద‌ర్ తో పాటు ప్ర‌యాగ అనే సిస్ట‌ర్ కూడా ఉన్నారు. నిజామాబాద్ లోనే శ‌ర‌ణ్య త‌న విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. నటి కావాలని శరణ్య ఎప్పుడు కోరుకోలేదు. చదువు పూర్తైన వెంట‌నే తెలంగాణలో ఒక లోకల్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా ఆమె తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత‌ టీ న్యూస్ లో తెలుగు భాష న్యూస్ షో ధుమ్ ధామ్ కు యాంకర్ గా వ్యవహరించింది. ఆపై వి6 న్యూస్ తెలుగులో తీన్మార్ న్యూస్ షోకు కూడా వ్యాఖ్యాతగా పనిచేసింది. వి6 ఛానల్ లో పనిచేస్తున్న సమయంలోనే సరదాగా ఫిదా మూవీ ఆడిషన్స్ లో శరణ్య పాల్గొంది. అనూహ్యంగా శేఖ‌ర్ క‌మ్ముల ఆమెనే సెలెక్ట్ చేశారు. యాంకర్ గా పని చేసిన అనుభవంతో వచ్చిన ఆమె తెలంగాణ యాస మరియు బోల్డ్ గా మాట్లాడే విధానం కారణంగా శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంలో సాయి పల్లవి అక్కగా రేణుక పాత్రను శరణ్యకు ఇచ్చారు. తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ కూడా ఫిదాలో శరణ్య ఎంతో చ‌క్క‌గా న‌టించి మెప్పించింది.

Sharanya Pradeep Wiki, Age, Family, Biography, And Movies - News Skook

దీంతో ఆమె నటనకు గాను 2018లో ఉత్తమ సహాయక నటిగా ఫిలిం ఫేర్ అవార్డుకు సైతం ఎంపికయింది. అలాగే ఫిదా గ్రాండ్ సక్సెస్ తో శరణ్య వెండితెరపై ఫుల్ బిజీ అయింది. శైలజారెడ్డి అల్లుడు, క్రేజీ క్రేజీ ఫీలింగ్, దొరసాని, మిస్ మ్యాచ్, జాను, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, తెల్లవారితే గురువారం, పుష్పక విమానం, మిషన్ ఇంపాసిబల్, రెక్కీ, ది వారియర్, ఖుషి, భామా క‌లాపం వంటి సినిమాల్లో నటించింది. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు, అక్క పాత్రలకు అద్భుతంగా యాప్ట్ అవుతూ శ‌ర‌ణ్య చాలా త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అనే ఫీల్ గుడ్ డ్రామాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ల‌భించింది. అలాగే ఇందులో సుహాస్ హీరో అయిన‌ప్ప‌టికీ.. ల‌క్ష్మిగా కీల‌క పాత్ర‌లో న‌టించిన శ‌రణ్య బాగా హైలెట్ అయింది.

Sharanya Pradeep Husband, Wiki, Age, Family, Caste, Biography, Pictures &  More

ఆమె పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె న‌టించిన విధానానికి ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఫిదా అవ్వాల్సిందే. హీరోను కూడా డామినేట్ చేసేంత అద్భుతంగా శ‌ర‌ణ్య న‌టించింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ శరణ్యలో దాగున్న నటిని కంప్లీట్ గా బయటపెట్టేసింది. ఈ చిత్రంలో శ‌ర‌ణ్య ద‌శ తిర‌గ‌డం ఖాయ‌మని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మున్ముందు శ‌ర‌ణ్య టాలీవుడ్ లో మ‌రింత బిజీ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక శ‌ర‌ణ్య ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. సినిమాల్లోకి రాక‌ముందే శ‌ర‌ణ్య‌కు వివాహం జ‌రిగింది. శ‌రణ్య యాంక‌ర్ గా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే ప్ర‌దీప్ మంకుని అనే అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. ప్ర‌దీప్ నేరుగా శ‌ర‌ణ్య ఎదుట పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. శ‌ర‌ణ్య‌కు కూడా అత‌నంటే ఇష్టం ఉండ‌టంతో వెంట‌నే ఓకే చెప్పింది. కానీ, ప్ర‌దీప్‌ను శ‌ర‌ణ్య ఇంట్లో వాళ్లు అంగీక‌రించ‌లేదు. దాంతో ఇంట్లో నుంచి పారిపోయి 2015 ఫిబ్ర‌వ‌రి 22న ప్ర‌దీప్‌తో శ‌ర‌ణ్య ఏడ‌డుగులు వేసింది. అయితే ప్ర‌దీప్ కూడా ఇండ‌స్ట్రీకి చెందిన‌వాడే. అత‌ను రైట‌ర్ మ‌రియు ఫోటోగ్రాఫ‌ర్‌. ప్ర‌దీప్ ప్రోత్సాహంతోనే శ‌ర‌ణ్య న‌టిగా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...