Home Film News Tamannaah: హెడ్ లైట్స్ లేవంటూ తమన్నా ఎద భాగాల‌పై కామెంట్స్..ఆమె రియాక్షన్ ఏంటంటే..!
Film News

Tamannaah: హెడ్ లైట్స్ లేవంటూ తమన్నా ఎద భాగాల‌పై కామెంట్స్..ఆమె రియాక్షన్ ఏంటంటే..!

Tamannaah: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ కొంద‌రు న‌ట‌న ప‌రంగా గుర్తింపు తెచ్చుకుంటే, మ‌రి కొంద‌రుగ్లామ‌ర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాత్రం అటు న‌ట‌న‌, ఇటు గ్లామ‌ర్‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. గ‌త దశాబ్ధ కాలంలో ఈ అమ్మడు డ్యాన్స్ ప‌రంగా ఓ ఊపు ఊపేసింది.  మ‌రోవైపు తన మిల్కీ అందాలతో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. కొన్ని రోజుల వ‌ర‌కు త‌మ‌న్నా కిస్ సీన్స్, టూ మ‌చ్ గ్లామ‌ర్ షో చేయ‌లేదు. కాని ఇప్పుడు అన్నింటికి సై అంటుంది. మ‌రోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న కూడా ఈ అమ్మ‌డు త‌గ్గ‌డం లేదు. రీసెంట్‌గా త‌మ‌న్నా న‌టించిన భోళా శంక‌ర్, జైల‌ర్ చిత్రాలు విడుద‌ల కాగా,ఇందులో జైల‌ర్ చిత్రం త‌మ‌న్నాకి మంచి విజ‌యాన్ని అందించింది.

అయితే హీరోయిన్స్  బాడీ షేమింగ్ విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం కామ‌న్. కాని త‌మ‌న్నా లాంటి అందెగత్తె కూడా బాడీ షేమింగ్ ఎదుర్కోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌నే స్వ‌యంగా బాడీ షేమింగ్ ఎదుర్కొన్న‌ట్టు తెలియ‌జేసింది.  ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు నన్ను చూసి హెడ్ లైట్స్ లేవంటూ నా ఎద భాగాలపై దారుణ‌మైన‌ కామెంట్లు చేశారు. అప్పడు నాకు ధైర్యం పోవ‌డంతో,  మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా స‌పోర్ట్ ఇచ్చారు. వారు ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఇక్కడి వరకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. చెక్కు చెదర‌ని అందంతో కుర్రాళ్ల‌ని బురిడి  కొట్టించే త‌మ‌న్నాకే ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైతే, మిగ‌తా వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని కొంద‌రు వాపోతున్నారు.

ఇక  మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పబ్లిక్ గా కనిపిస్తే ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె రీసెంట్ గా తమన్నా తమిళనాడులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ల‌గా, అక్క‌డ ఆమెని చూడ‌డానికి పెద్ద ఎత్తున అభిమానులు వ‌చ్చారు. పోలీసులు కూడా భారీ బందోబ‌స్త్ నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ ఓ అభిమాని బారికేడ్స్ దూకి త‌మ‌న్నా ద‌గ్గ‌ర‌కి వెళ్లాడు. చుట్టూ ఉన్న బౌన్స‌ర్స్ అత‌డిని ప‌క్క‌కు లాగేస్తుండ‌గా,  చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిన త‌మ‌న్నా  అతడి కోరిక మేరకు సెల్ఫీకి ఫోజు  ఇచ్చి ఆనందింప‌జేసింది .  తమన్నా చేసిన పనిపై ఇప్పుడు  అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...