Home Film News దుమారం రేపుతున్న కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్!
Film News

దుమారం రేపుతున్న కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్!

Kamal R Khan Tweet Goes Viral

బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంకా చోప్రా గురించి మనందరికీ తెలిసిందే. ఆమె వయసులో తనకన్నా చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం అయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా వాళ్ళ మధ్య జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ నిత్యం హాపీ గానే ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ తెలియజేస్తూనే ఉంటారు. ఐతే, వీళ్ళ మధ్య రిలేషన్ ఒక పబ్లిక్ మేటర్ కూడా అయిన నేపథ్యంలో ఈ మధ్య వచ్చిన ఒక ట్వీట్ వివాదానికి దారి తీస్తుంది.

కమాల్ ఆర్ ఖాన్ అనే వ్యక్తి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ లో.. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల మధ్య రిలేషన్ పదేళ్ళకి మించి ఉండదని.. వచ్చే పదేళ్ళలో వాళ్ళు కచ్చితంగా విడిపోతారు అని అన్నాడు. ఈ విషయం ప్రియాంక అభిమానులను బాగా గాయపరిచింది. ఇలా సంతోషంగా కలిసి ఉన్న జంటను ఇలాంటి ఆలోచనలతో ఎందుకు డిస్టర్బ్ చేయటమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

అలాగే తరచూ ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉండే ఖాన్ ని రాజకీయ కోణాల్లో కూడా చూస్తున్నారు కొంతమంది. అతనికి వాళ్ళ జంటని చూసి ఈర్ష్యగా ఉందని, అందుకే వాళ్ళపై ఏదో ఒకటి చెప్పి.. పాపులర్ అవ్వాలి అనుకుంటున్నాడని అంటున్నారు. మరికొంత మంది ఇంకాస్త ఘాటుగా అతనికి స్పందిస్తున్నారు. నువ్వు కూడా పదేళ్ళలో చస్తావులే.. అని బదులిస్తున్నారు. ఈ విషయంపై కొందరు ప్రముఖులు కూడా స్పందించటంతో ఇది బాలీవుడ్ లో ఒక పెద్ద చర్చనీయాంశం ఐపోయింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...