Home Special Looks ఇండస్ట్రీలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు ఎవరెవరంటే..
Special Looks

ఇండస్ట్రీలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు ఎవరెవరంటే..

Celebs Who Are Married Twice

సెలబ్రిటీల జీవితాలు సాధారణమైన వాళ్ళ కన్నా కాస్త భిన్నంగా ఉంటాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గరనుంచి వాళ్ళు అనుసరించే చాలా విషయాలు నార్మల్ పీపుల్ కి కాస్త అసాధారణంగానే అనిపిస్తాయి. డబ్బు, ఫేమ్ వాళ్ళని తమకి నచ్చినట్టు లైఫ్ ని డిసైడ్ చేసుకునేలా చేస్తుంది. సినీ తారలుగా వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయడంలో ఏ మాత్రం తగ్గరు. ఇలా విభిన్నంగా కనిపిస్తారు కాబట్టే.. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఒక కుతూహలం మనలో ఏర్పడుతుంది. అందుకే ఇలా మనకి బాగా తెలిసిన వాళ్ళు నాలుగు గోడల మధ్య ఎలా బ్రతుకుతారు అన్న విషయాన్ని చూడాలి అనుకుంటాం కాబట్టి బిగ్ బాస్ అనే షో అంతగా పాపులర్ అయ్యింది.

ఐతే, అసలు విషయానికి వద్దాం. అందరి జీవితాల్లోనూ కొన్ని కామన్ విషయాలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం. ఒక సాధారణ మనిషికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ సెలబ్రిటీలు దీన్ని చాలా సునాయాసంగా అధిగమించి మరో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఐతే, వాళ్ళలా చేసుకోవడం కరెక్టా తప్పా అని మనం ఆలోచించడం లేదు. వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళని మరో పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహించి ఉండొచ్చు.

ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరినుంచి మొదలుపెడదాం. ఆయన మొదట బసవతారకం అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆమెతో తన చివరిరోజుల దాకా కలిసే ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత రామారావ్ గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తర్వాత కృష్ణ గారు. ఆయన మొదట ఇందిరాదేవిని పెళ్లి చేసుకుని, తర్వాత విజయనిర్మలని పెళ్లాడారు. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ కొడుకైన హరికృష్ణ మొదట లక్ష్మీ అనే ఆమెని పెళ్లి చేసుకున్న ఆయన తర్వాత షాలిని అనే ఆమెని పెళ్లాడారు.

నాగార్జున మొదట వెంకటేష్ చెల్లి అయిన లక్ష్మిని చేసుకుని తర్వాత ఏవో కారణాల వల్ల విడిపోయి అమలని పెళ్లి చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాబట్టి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. రాధిక కూడా తన పవర్ చూపించడం కోసం మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. ప్రస్తుతం శరత్ కుమార్ తో ఆమె రాణిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఐతే, మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు, మంచు లక్ష్మిలకి కూడా రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. చాలా రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఆమె భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...