Home Film News Telugu Serials: ఆల్ టైమ్ బెస్ట్ తెలుగు సీరియ‌ల్స్ ఇవే.. మీరు చూశారా…!
Film News

Telugu Serials: ఆల్ టైమ్ బెస్ట్ తెలుగు సీరియ‌ల్స్ ఇవే.. మీరు చూశారా…!

Telugu Serials: సినిమాల క‌న్నా సీరియ‌ల్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉంద‌ని చాలా సార్లు ప్రూవ్ అయింది. ఒక ఎపిసోడ్ మిస్ అయితే అస‌లు ఏం జ‌రిగింది అని ఆరాలు తీయడం మొద‌లుపెడ‌తారు. తెలుగు, త‌మిళ, హిందీ..ఇలా భాష ఏదైనా స‌రే సీరియ‌ల్స్‌ని మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు. సీరియ‌ల్స్‌లో స‌రికొత్త ట్విస్ట్ ఇస్తున్న నేప‌థ్యంలో కొన్ని సీరియ‌ల్స్ అయితే సంవ‌త్సరాల పాటు న‌డుస్తున్నాయి. అయితే ప్రేక్ష‌కులని ఆ రోజుల్లో ఎక్కువ‌గా మెచ్చిన సీరియ‌ల్స్ ఏంటో చూస్తే..  లేడీ డిటెక్టివ్ సీరియ‌ల్… ఈ సీరియ‌ల్ అప్పుడు ప్ర‌తి మంగ‌ళ‌వారం  ప్రసారం అయ్యేది. ఈ సీరియ‌ల్ లో న‌టించిన ఉత్త‌రకి మంచి పేరు వ‌చ్చింది. ఆమె ఆ త‌ర్వాత‌ ఉత్త‌ర పెళ్లి చేసుకుని న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసింది.
ఇక ఈటీవీలో స్నేహ అనే సీరియ‌ల్ కూడా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అన్వేషిత అనే సీరియ‌ల్‌కి కూడా ఎంతో మందికి న‌చ్చింది. ఇందులో అచ్యుత్,  య‌మున ప్రధాన పాత్ర‌లు పోషించ‌గా, ఈ సీరియ‌ల్‌కి ఎనిమిది నంది అవార్డులు వ‌చ్చాయి. ఇక  అంత‌రంగాలు సీరియ‌ల్ కూడా చాలా మందిని ఆక‌ట్టుకుంది..  ఈ సీరియ‌ల్ లో న‌టించిన క‌ల్ప‌నకి ఏకంగా సినిమా అవ‌కాశాలు కూడా అందుకుంది. 2000వ దశకం ప్రారంభంలో దూరదర్శన్‌లో ప్రసారమైన తొలి తెలుగు సీరియల్ ఒక‌టి కాగా,దీనికి  బిందు నాయుడు మరియు మంజుల నాయుడు సంయుక్తంగా రచించిన మరియు దర్శకత్వం వహించారు.
ప్రభాకర్ పొడకండ్ల మరియు శ్రీ దివ్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సీరియల్  ఫుల్ టీఆర్పీ ద‌క్కింది. హర్ష వర్ధన్, శివాజీ రాజా, నరేష్ కీలక పాత్రల్లో రూపొందిన అమృతం ఫ్యామిలీ కామెడీ షో 2001-2007 మధ్య కాలంలో జెమినీ టీవీలో ప్రసారం కాగా, ఈ సీరియ‌ల్ కోసం క‌ళ్ల‌ప్ప‌గించి చూసేవారు. ఇలియాస్ అహ్మద్ రచించి, దర్శకత్వం వహించిన అలౌకిక సీరియ‌ల్  2004-2006 మధ్య ఈటీవీలో ప్ర‌సారమై మంచి టీఆర్పీ రాబ‌ట్టింది.ఎమోషనల్‌ ఫ్యామిలీ సీరియల్‌గారూపొందిన  చక్రవాకం జెమినీ టీవీలో ప్రసారమయ్యేది. ఇంద్ర నీల్, ప్రీతి అమీన్, లిఖిత, రామ్ ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సీరియల్‌కి మంజుల నాయుడు రచన మరియు దర్శకత్వం వహించ‌గా, దీనికి మంచి టీఆర్పీ ద‌క్కింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...