Home Film News Shabaash Mithu : మిథాలీగా తాప్సీ అరిపించేసింది!
Film News

Shabaash Mithu : మిథాలీగా తాప్సీ అరిపించేసింది!

Shabaash Mithu
Shabaash Mithu

Shabaash Mithu: సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్‌కి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్‌లో ఇప్పటికే స్పోర్ట్స్, పాలిటిక్స్, ఫిలిం స్టార్స్‌కి సంబంధించి బయోపిక్స్ వచ్చాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది బాలీవుడ్.

ఉమెన్ క్రికెటర్‌గా, టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా.. తాప్సీ పన్ను మెయిన్ లీడ్‌గా నటిస్తున్న మూవీ ‘శభాష్ మిథు’.. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

మిథాలీ క్యారెక్టర్‌లో తాప్సీ ఒదిగిపోయింది. చిన్నతనం నుండి క్రికెటర్ కావాలని కలలు కనడం.. ట్రైనింగ్ తీసుకుని అకాడమీలోకి, ఆ తర్వాత ఆటలోకి అడుగుపెట్టాక జరిగిన సంఘటనలు, అవమానాలు.. వాటన్నిటినీ ఎదుర్కొని దేశ వ్యాప్తంగా మహిళా క్రికెట్‌కి గుర్తింపు తీసుకురావడం అనేది ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించారు.

తాప్సీతో సహా లీడ్ క్యారెక్టర్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచాయి. వయాకామ్ 18 స్టూడియోస్, కొలోస్సియం మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 15న ‘శభాష్ మిథు’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...