Home Film News Manchu Lakshmi’s Tweet: మ‌నోజ్ పెళ్లి విష్ణుకి ఇష్టం లేదు.. మంచు ల‌క్ష్మీ ట్వీట్‌తో ఉలిక్కి పడ్డ మంచు ఫ్యాన్స్
Film News

Manchu Lakshmi’s Tweet: మ‌నోజ్ పెళ్లి విష్ణుకి ఇష్టం లేదు.. మంచు ల‌క్ష్మీ ట్వీట్‌తో ఉలిక్కి పడ్డ మంచు ఫ్యాన్స్

Manchu Lakshmi’s Tweet: మోహన్ బాబు వార‌సులిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మ‌నోజ్, మంచు విష్ణు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. మనోజ్ ఇటీవలే భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోగా.. ఆ పెళ్లి విష్ణుకు ఇష్టం లేదని, అందుకే పెళ్లికి కూడా తాను గెస్ట్ మాదిరిగా వచ్చి వెళ్లిపోయాడని అని కూడా ప‌లువురు చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి త‌ర్వాత మంచు మ‌నోజ్ షేర్ చేసిన వీడియో ఒక‌టి తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమ దగ్గర చాలా ఏళ్ల పాటు పనిచేసిన సమీప బంధువు సారథిపై విష్ణు చేయి చేసుకున్నాడ‌ని మ‌నోజ్ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. దీంతో అన్నదమ్ముల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని అంద‌రు భావించారు.

మంచు లక్ష్మీని, మంచు మ‌నోజ్ ని ఈ వివాదం గురించి ప‌లు మార్లు ప్ర‌శ్నించిన స‌మాధానం ఇవ్వ‌కుండా దాట‌వేశారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ.. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించింది. మనోజ్ పెండ్లి నిజంగానే విష్ణుకి ఇష్టం లేదా అని ఓ నెటిజన్ అడగ్గా.. ఎస్ అంటూ స‌మాధానం ఇచ్చింది లక్ష్మీ. దాంతో ఆమె చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నిజంగానే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా అర్ధ‌మైంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

 

మరోవైపు విష్ణు, లక్ష్మి.. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి పిల్లలు అనే విష‌యం తెలిసిందే. ఆమె మరణం తర్వాత ఆయన విద్యాదేవి చెల్లెలు నిర్మలా దేవిని వివాహం చేసుకోగా.. వారికి మంచు మనోజ్ జన్మించాడు. అయితే మొద‌టి నుండి ఈ ముగ్గ‌రు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడైతే మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడ‌ని అనుకున్నాడో అప్ప‌టి నుండి అన్న‌ద‌మ్ముల మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టు తెలుస్తుంది.మోహ‌న్ బాబుకి కూడా మ‌నోజ్ రెండో పెళ్లి ఇష్టం లేక‌పోయిన కూడా మంచు ల‌క్ష్మీ స‌ర్ధి చెప్ప‌డం వ‌ల్ల‌నే వెళ్లి ఉంటాడ‌ని కొంద‌రు భావించారు.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...