Home Film News Ibrahim: స్టార్ హీరో త‌న‌యుడిని తోసేసిన ఫొటోగ్రాఫ‌ర్స్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఇబ్రహిం
Film News

Ibrahim: స్టార్ హీరో త‌న‌యుడిని తోసేసిన ఫొటోగ్రాఫ‌ర్స్.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఇబ్రహిం

Ibrahim: సెల‌బ్రిటీలు ప‌లు మార్లు ఫొటోగ్రాఫ‌ర్స్ వ‌ల‌న చాలా ఇబ్బందులు ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స్టార్స్ ని త‌మ కెమెరాలలో బంధించే క్ర‌మంలో కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ ఇబ్బందుల‌కి గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఫొటోగ్రాఫ‌ర్స్  కారణంగా ప్రముఖ బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహిం అలీఖాన్  చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఇంత‌కీ ఏమైందంటే..   ఇబ్రహిం అలీ ఖాన్‌ తన అక్క సారా అలీఖాన్‌, తల్లి అమ్రితా సింగ్‌తో కలిసి  రీసెంట్‌గా ముంబైలో సినిమా థియేట‌ర్‌కి వెళ్లాడు. అయితే వారు అక్క‌డికి వ‌చ్చార‌ని తెలుసుకున్న ఫొటోగ్రాఫ‌ర్స్ అక్క‌డికి వెళ్లి వారిని ఫొటోలు తీసేందుకు ఎదురు చూశారు.

ఎప్పుడైతే వారు థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారో.. వారిపైకి తీసుకుంటూ వెళ్లారు ఫొటోగ్రాఫ‌ర్స్.  ఈ నేపథ్యంలోనే ఇబ్రహింను ఓ ఫొటోగ్రాఫ‌ర్ పక్కకు తోసేశాడు. ఆ ఫొటోగ్రాఫ‌ర్  ప్రవర్తనతో ఇబ్రహిం కొంత ఆగ్రహానికి గురయ్యాడు. వారి మధ్యలోంచి కోపంగా బయటకు వ‌స్తూ.. ఫొటోగ్రాఫ‌ర్స్ ని తిట్టుకుంటూ కారు దగ్గరకు వెళ్లిపోయాడు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి మాత్రం  సోషల్‌ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన కొంద‌రు ఫొటోగ్రాఫ‌ర్‌పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారిని మ‌రీ ఇంత ఇబ్బంది పెట్ట‌డం స‌రికాదు అని హిత‌వు ప‌లుకుతున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీ ఖాన్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. మంచి మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. రీసెంట్‌గా ఆదిపురుష్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టించారు. ఇందులో సైఫ్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించ‌నున్నాడు. జూన్ 16న చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎదురు చూస్తున్నారు. ఇక సైఫ్ కూతురు సారా అలీఖాన్   2018లో వచ్చిన ‘కేధార్‌నాథ్‌’ సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న ఈ ముద్దుగుమ్మ  ‘జర హట్కే.. జర బట్కే’ అనే సినిమాతో  ప్రేక్షకులని ప‌ల‌క‌రించింది. ఆ సినిమా చూడ్డానికే  వారు థియేట‌ర్‌కి వెళ్లగా, ఫొటోగ్రాఫ‌ర్స్ వ‌ల‌న ఇబ్బంది ప‌డ్డారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...