Home Film News Prabhas Villa: ఇట‌లీలో విల్లా కొనుగోలు చేసిన ప్ర‌భాస్.. అద్దె ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Film News

Prabhas Villa: ఇట‌లీలో విల్లా కొనుగోలు చేసిన ప్ర‌భాస్.. అద్దె ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Prabhas Villa: బాహుబ‌లి సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ప్ర‌భాస్ మ‌న‌దేశంలోనే కాక విదేశాల‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగి ఉన్నాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కి ఒక్క మంచి హిట్ కూడా ప‌డ‌లేదు. ప‌డి ఉంటే మాత్రం ప్ర‌భాస్ క్రేజ్, రేంజ్ ఓ స్థాయిలో ఉండి ఉండేది. రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం కూడా ఫ్లాప్ కావ‌డం ప్ర‌భాస్‌ని తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది. ఇప్పుడు ప్ర‌భాస్‌తో పాటు ఆయ‌న అభిమానులు కూడా స‌లార్ చిత్రంపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన ప్ర‌శాంత్ నీల్ స‌లార్ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాడు. అయితే ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇప్పుడు ఇండియ‌న్ సినిమా చరిత్రలో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అని తెలుస్తుంది.

ఆదిపురుష్ చిత్రానికి గాను ప్ర‌భాస్..150 కోట్ల‌కి పైగా రెమ్యున‌రేష‌న్ అందిపుచ్చుకున్నాడని స‌మాచారం. అయితే ప్రభాస్ చేస్తున్న‌సినిమాల‌కి సంబంధించిన జ‌యాప‌జ‌యాలు ప‌క్క‌న పెడితే మ‌నోడు బాగానే సంపాదిస్తున్నాడ‌ని టాక్. ఇక త‌న సంపాద‌న‌లో కొంత భాగాన్ని విదేశాల‌లో పెట్టుబ‌డి పెడుతున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ విలాస‌వంత‌మైన విల్లా ఒక‌టి ఇటలీలో  కొనుగోలు చేశాడ‌ట‌. సినిమా షూటింగ్స్ బ్రేక్ స‌మ‌యంలో ప్ర‌భాస్ అక్క‌డికి వెళ్లి స‌మ‌యం గ‌డుపుతార‌ట‌. ఇక ఆయ‌న ఇక్క‌డ షూటింగ్స్ తో బిజీగా ఉన్న స‌మ‌యంలో విల్లా ఖాళీగానే ఉంటుంది కాబ‌ట్టి దానిని అద్దెకు ఇచ్చార‌ట‌.

ఇటలీకి నిత్యం ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌గానే ఉంటుంది కాబ‌ట్టి అక్క‌డికి వచ్చే పర్యాటకులు, లేదంటే  స్థానికంగా ఉండే బడాబాబులకు ఈ విల్లాను అద్దెకు ఇస్తున్నారని తెలుస్తుంది.. ఈ అద్దెల ద్వారా నెలకు రూ.40 లక్షలు ప్ర‌భాస్ అందుకుంటున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. ఇక కెరీర్‌లో ఇంత మంచిగా సెటిల్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ పెళ్లి జోలికి వెళ్ల‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. త‌న తోటి హీరోలంద‌రు పెళ్లి చేసుకుంటున్న‌ప్ప‌టికీ ప్ర‌భాస్ ఆ ఊసే ఎత్త‌డం లేదు. వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.  ప్ర‌భాస్ న‌టించిన భారీ ప్రాజెక్ట్ స‌లార్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...