Home Film News Lavanya: పెళ్లి కాక ముందే ఫారెన్‌లో తెగ తిరిగేస్తున్న లావణ్య‌-వ‌రుణ్‌.. కుర‌చ దుస్తుల‌లో కేక‌
Film News

Lavanya: పెళ్లి కాక ముందే ఫారెన్‌లో తెగ తిరిగేస్తున్న లావణ్య‌-వ‌రుణ్‌.. కుర‌చ దుస్తుల‌లో కేక‌

Lavanya: త్వ‌ర‌లో మెగా ఫ్యామిలీలో ఓ పెద్ద వేడుక జ‌ర‌గ‌నున్న సంగ‌తి మనంద‌రికి తెలిసిందే. కొన్నాళ్ల‌పాటు సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపి జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకున్న వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా వీరి వివాహం ఉంటుంద‌ని తెలుస్తుంది.పెళ్లికి భారీగానే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇక మెగా హీరోలంద‌రూ ఓ వేదిక‌పైకి రావ‌టం అనేది చాలా అరుదుగా క‌నిపిస్తుంది. అప్పుడెప్పుడో నిహారిక పెళ్లిలో మెరిసిన వారు ఇప్పుడు  వ‌రుణ్ తేజ్ పెళ్లిలో అంద‌రూ క‌లిసి క‌నువిందు చేయ‌బోతున్నారు. అయితే వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య‌లు ప్ర‌స్తుతం తాము క‌మిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం లావణ్య తమిళంలో ఓ సినిమాతో పాటు ఒక‌ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు టాక్. మ‌రోవైపు వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వ‌ర‌గా వాటిని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు.. అయితే షూటింగ్ సమయాల్లో చాలా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ  కాస్త టైమ్ దొరికితే చాలు.. ఈ లవ్ బర్డ్స్ విదేశాల్లో  చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఎంగేజ్ మెంట్ అయిపోయిన వెంటనే  వీరు విదేశాల్లో విహరించ‌డం, వాటికి సంబంధించిన అప్‌డేట్ లావ‌ణ్య ఇవ్వ‌డం మ‌నం చూశాం. తాజాగా ఈ జంట విదేశాల‌లోనే ఉన్న‌ట్టు తెలుస్తుంది.

లావ‌ణ్య త్రిపాఠి తాజాగా వైట్ అండ్ వైట్ ధ‌రించి ఫారెన్ వీధుల్లో మెస్మ‌రైజ్ చేసింది. ఇందులో లావ‌ణ్య చాలా అందంగా క‌నిపిస్తుంది. అయితే ఈ ఫొటో తీసింది మరెవ‌రో కాదు కాబోయే భ‌ర్త  విటికె (VTK) అని చెప్పింది.. అంటే వరుణ్ తేజ్ కొణిదెల తీశాడని చెప్పేసింది. ఇక ఫొటోలు చూస్తే ఒక ఫొటోలో మనిషి నడుచుకుంటూ వెళ్తుండగా.. రెండో ఫోటోలో మాత్రం కనిపించడు. దీన్నే తెలియ చేస్తూ.. ఆమె క్యాప్షన్ లో రాసుకొచ్చింది . ప్రస్తుతం  లావణ్య త్రిపాఠి ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక మెగా కుటుంబలో అడుగు పెట్టడానికి లావ‌ణ్య త్రిపాఠి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది.ఇటీవ‌ల నిహారిక విడాకుల విష‌యంలో కూడా లావ‌ణ్య త్రిపాఠి ఇన్వాల్వ్ అయి నిహారిక‌తో పాటు నాగ‌బాబుకి కూడా ధైర్యం చెప్పిన‌ట్టు టాక్.

Related Articles

Cómo apostar al tenis mexicano Pin Up

Cómo apostar al tenis mexicano Pin Up

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...