Home Film News KGF Hero: ఎట్ట‌కేల‌కు లేడి డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పిన కేజీఎఫ్ హీరో.. బ్యాక్ డ్రాప్ కి పూన‌కాలే..!
Film News

KGF Hero: ఎట్ట‌కేల‌కు లేడి డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పిన కేజీఎఫ్ హీరో.. బ్యాక్ డ్రాప్ కి పూన‌కాలే..!

KGF Hero: కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హీరో య‌ష్‌. గ‌తంలో ఆయ‌న ప‌లు మంచి చిత్రాలు చేసిన కూడా కేజీఎఫ్ చిత్రంతో ఒక్క‌సారిగా ఆయ‌న క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ఇదే జోష్ లో కేజీఎఫ్ 2 అనే చిత్రం కూడా చేశాడు. ఈ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. అయితే కేజీఎఫ్ 2 చిత్రం త‌ర్వాత య‌ష్ ఏ చిత్రం చేయ‌బోతున్నాడు, ద‌ర్శ‌కుడు ఎవ‌రు, మూవీ గురించి ఎప్పుడు ప్ర‌క‌టిస్తాడు అని అంద‌రు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. `యష్‌19 చిత్రంపై చాలా రూమర్స్‌ వచ్చినా కూడా  ఇప్పటి వరకు ఏదీ ఫైనల్‌ కాలేదు.

గత రెండు సంవ‌త్సరాలుగా యష్‌ కథలు వింటూనే ఉన్నారు. కానీ ఏదీ  కూడా ఫైనల్‌ చేయలేదు. అయితే తాజాగా య‌ష్ త‌దుప‌రి సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. లేడి డైరెక్ట‌ర్‌తో య‌ష్ త‌న త‌దుప‌రి చిత్రం చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. `మూతన్‌` చిత్రంతో మ‌ల‌యాళ లేడి డైరెక్ట‌ర్  గీతూ మోహన్‌దాస్ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. ఆమె ప్ర‌స్తుతం య‌ష్  హీరోగా సినిమా చేసేందుకు సిద్దంగా ఉంద‌ని అంటున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకురాలు కంటే నటిగానే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. ఆమె ఇప్పటి వరకు రెండు సినిమాలు చేయ‌గా, వీటికి స్టేట్‌ అవార్డులతోపాటు ఇంటర్నేషనల్‌ అవార్డులు కూడా వ‌చ్చాయి.

ఇటీవ‌ల ఆమె యష్‌ని క‌లిసి కథ చెప్పిగా, ఆయన ఓకే చెప్పారని, ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జ‌రుగుతుంద‌ని టాక్ నడుస్తుంది. ఇక దీని బ్యాక్ డ్రాప్ విష‌యానికి వ‌స్తే ఇది మాఫియా క‌థ‌తో రూపొందుతుంద‌ని టాక్. ఇందులో య‌ష్ గ్యాంగ్ స్ట‌ర్‌గా న‌టిస్తార‌ని స‌మాచారం. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన య‌ష్ కి మాములు క‌థ‌లు ఇప్పుడు అంత సెట్ కావు. అందుకే ఆయ‌న మాఫియా బ్యాక్ డ్రాప్‌లోనే త‌న త‌దుపరి సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. త్వ‌రలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...