Home Film News Nikhil: నాకు చాలా సార్లు డ్ర‌గ్స్ ఆఫ‌ర్ చేశారు.. హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్
Film News

Nikhil: నాకు చాలా సార్లు డ్ర‌గ్స్ ఆఫ‌ర్ చేశారు.. హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

Nikhil: టాలీవుడ్‌లో డ్ర‌గ్స్  క‌ల‌క‌లం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఆ మధ్య టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు డ్ర‌గ్స్ వివాదంలో ఇరుక్కొని విచార‌ణ కూడా ఎదుర్కొన్నారు. ఇక రీసెంట్‌గా క‌బాలి నిర్మాత కేపీ చౌద‌రి డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి టాలీవుడ్‌పై ప‌డింది. ఈ స‌మ‌యంలో యువ హీరో నిఖిల్ త‌న‌కు చాలా సార్లు డ్ర‌గ్స్ ఆఫ‌ర్ చేశారంటూ కామెంట్స్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా  హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో హీరో నిఖిల్‌, న‌టుడు ప్రియ‌ద‌ర్శి పాల్గొన్నారు.

ఈ కార్యక్ర‌మంలో నిఖిల్ మాట్లాడుతూ.. న‌న్ను చాలా సార్లు డ్ర‌గ్స్ తీసుకోమ‌ని చెప్పిన వాటి జోలికి వెళ్ల‌లేదు. కొంద‌రు చేస్తున్న ప‌నుల వ‌ల‌న ఇండ‌స్ట్రీకి బ్యాడ్ నేమ్ వ‌స్తుంది. ఇలాంటి వాటికి ప్ర‌తి ఒక్క‌రు దూరంగా ఉండాలి.  నార్కోటిక్స్‌కి అలవాటు పడ్డారంటే అదే డెత్ సెంటెన్స్ అని నిఖిల్ సూచించారు. విద్యార్ధుల‌కి  అందమైన జీవితం ఉందని.. ఆ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంలో త‌ప్పులేదు. పార్టిస్‌కి  వెళ్లిన‌ప్పుడు డ్రగ్స్ మాత్రం తీసుకోకండి అంటూ చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కారణంగా కొందరు నిందితులుగా, . మరి కొందరు బాధితులుగా మిగులుతున్నారన్నారు నిఖిల్‌.

ఈ ప‌రిణామాలు స‌మాజానికి ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని తాను కోరుకుంటున్న‌ట్టు నిఖిల్ స్ప‌ష్టం చేశారు. ప్రియ‌ద‌ర్శి కూడా మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు నేను ఎక్కువ‌గా సిగరెట్ తాగేవాడిని. కాని నాలో నేను ఆలోచించుకొని మానేసాను. తాను ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా సంతోషంగా ఉన్న‌ట్టు ప్రియ‌ద‌ర్శి అన్నారు. ఇక  విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రియదర్శి. ఇక ఇదిలా ఉంటే డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న కేపీ చౌదరి ఫోన్‌‌లో ఏకంగా 9 వేల నెంబర్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారిలో బిగ్‌బాస్‌ ఫేం అషూ రెడ్డి, నటి సురేఖావాణి, జ్యోతి, హీరో సుశాంత్ రెడ్డి, రఘుతేజ లాంటి వాళ్ల పేర్లు  అంద‌రి దృష్ట‌ని ఆక‌ర్షిస్తున్నాయి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...