Home Film News Khushi: ఆ మూడు సినిమాల‌ని క‌లిపి ఖుషీ తీసాడా.. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందా?
Film News

Khushi: ఆ మూడు సినిమాల‌ని క‌లిపి ఖుషీ తీసాడా.. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందా?

Khushi: రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గీతా గోవిందం సినిమా త‌ర్వాత మంచి విజ‌యం ఒక్క‌టి కూడా అందుకోలేదు. ఆయ‌న వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నా కూడా ఒక్క‌టి కూడా అత‌నికి మంచి ఫ‌లితాన్ని ఇవ్వ‌డం లేదు.  చివరిగా లైగ‌ర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని చేయ‌గా, ఈ మూవీ అయితే దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఇక సెప్టెంబ‌ర్ 1న ఖుషీ అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ చిత్రం నుండి విడుద‌లైన పాట‌లు,టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ చూశాక ఈ  చిత్రం మూడు పాత తెలుగు సినిమాల‌ని క‌లిపిన‌ట్టుగా అనిపించింది. చిత్ర హీరో కాశ్మీర్‌ వెళ్లి అక్కడ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించడం, కానీ తరువాత తను ముస్లిం కాదు బ్రాహ్మణ అమ్మాయి అని తెలియడం వంటివి చూస్తే ఇది బ‌న్నీ-పూరీ కాంబోలో తెర‌కెక్కిన దేశ ముదురు చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది.

ఇక ఖుషీ చిత్రంలో హీరో, హీరోయిన్ రెండు వేరు వేరు కమ్యూనిటీలు చెందిన వారు కావడం, ఇంట్లో వాళ్ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని వారు భావించ‌డం చూస్తే.. ఇటీవ‌ల వ‌చ్చిన నాని.. అంటే సుంద‌రానికి గుర్తు తెస్తుంది. ఇక పెళ్లయ్యాక హీరో, హీరోయిన్ మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డం చూస్తే   విజయ్ దేవరకొండ చిత్రం  అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఖుషి చిత్రం కోసం శివ నిర్వాణ మూడు సినిమాల‌ని క‌లిపాడా అని అంద‌రు  ముచ్చ‌టించుకుంటున్నారు. భారీ అంచ‌నాల‌ తో విడుదలైన విజయ్ చిత్రం లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా  మార‌డంతో ఖుషీ సినిమా హిట్ కావ‌డం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి చాలా అవ‌స‌రం. శివ నిర్వాణ కొన్నాళ్లుగా స‌క్సెస్ సాధించ‌లేదు. ఆయ‌నకి కూడా ఈ సినిమా విజయం ఎంతో అవ‌స‌రం.

కానీ  ఇప్పుడు కథ చూస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ  వాళ్ళ కోరిక తీరేలా కనిపించడం లేదు. మామూలుగా అయితే  శివ నిర్వాణ కథనం చాలా స్మూత్ గా ఉంటుంది. త‌ను అనుకున్న‌ సున్నితమైన టేకింగ్ తో ఆర్డినరీ కథను ఎక్సట్రార్డినరీగా చూపించగల  తెలివైన దర్శకుడు కాగా, ఖుషీ సినిమా విష‌యంలో శివ నిర్వాణ మ్యాజిక్  ఏ ర‌కంగా ప‌ని చేస్తుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...