Home Film News Bigg Boss 7 Contestants: బిగ్ బాస్ 7కి ఆ ప‌ది మంది ఖ‌రారు.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో ఉండ‌డం ఖాయం..!
Film News

Bigg Boss 7 Contestants: బిగ్ బాస్ 7కి ఆ ప‌ది మంది ఖ‌రారు.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో ఉండ‌డం ఖాయం..!

Bigg Boss 7 Contestants: గత ఆరు సీజ‌న్స్ నుండి బుల్లితెర ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌. ఎన్టీఆర్ మొద‌టి సీజ‌న్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ఉన్నారు. ఆ త‌ర్వాత నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్ప‌టి నుండి త్వ‌ర‌లో మొద‌లు కానున్న ఏడో సీజ‌న్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా ఉంటున్నారు. ఆరో సీజ‌న్‌లో నాగార్జున హోస్టింగ్ కూడా కాస్త బెడిసి కొట్టింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కంటెస్టెంట్స్ విష‌యంలో కూడా నిర్వాహ‌కులు పెద్దగా ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో సీజ‌న్ 6కి దారుణ‌మైన రేటింగ్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి త‌ప్పులేమి జ‌ర‌గ‌కుండా నిర్వాహ‌కులు జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

గ‌త కొద్ది రోజులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ పేర్లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.తాజా స‌మాచారం ప్ర‌కారం ఏడో సీజన్‌లో కామన్ మ్యాన్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ ఓ కంటెస్టెంట్‌గా ఖరారు అయ్యినట్లుస‌మాచారం. అత‌నికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో మంచి ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక మొగలి రేకులు సీరియల్‌లో ఆర్.కే. నాయుడు అనే పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ ద‌క్కించుకున్న అత‌నికి 70 నుంచి 80 వేల మధ్యలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చి తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. జబర్దస్త్‌ కామెడీ షోలో.. టీమ్ లీడర్‌గా రాణిస్తున్న బుల్లెట్ భాస్క‌ర్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్.తెలుగులో కార్తిక దీపం సీరియల్‌లో డాక్టర్ మోనితగా ఫేమస్ అయిన శోభా శెట్టి కూడా సీజ‌న్ 7కి ఫైనల్ అయిన‌ట్టు తెలుస్తుంది.

 

ఇక యాంక‌ర్ విష్ణు ప్రియ కొన్ని సీజ‌న్స్ నుండి వ‌స్తుంద‌ని అంటున్నారు. కాని ఈ సీజ‌న్‌కి మాత్రం ప‌క్కా అని చెబుతున్నారు. బేబి సినిమాలో కథానాయికగా బోల్డ్‌గా నటించి వావ్ అనిపించుకున్న వైష్ణ‌వి చైత‌న్య కూడా బిగ్ బాస్ లో అడుగుపెట్ట‌నుంద‌ని టాక్. లుగులో పలు సీరియల్స్‌లో నటించి బాగా పాపులర్ అయ్యిన కన్నడ భామ నవ్య స్వామి బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇవ్వ‌నుందని స‌మాచారం.తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు‌గా నటించిన సురేఖా వాణి, తెలుగులో బుల్లెట్ బండి పాటతో ఫేమస్ అయిన మోహన భోగరాజు, టీవీ నటుడు ప్రభాకర్, టిక్ ‌టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకొని యాంక‌ర్‌గా అల‌రిస్తున్న‌ దీపిక పిల్లి, టిక్ టాక్ దుర్గారావు దంప‌తులు బిగ్ బాస్ సీజ‌న్ 7లో సంద‌డి చేయ‌డం ఖాయం అని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...