Home Film News Payal: అందం ఉన్నా గుర్తింపు లేని పాయ‌ల్.. కొంద‌రు న‌న్ను మిస్ గైడ్ చేశారంటూ సంచ‌ల‌న కామెంట్స్
Film News

Payal: అందం ఉన్నా గుర్తింపు లేని పాయ‌ల్.. కొంద‌రు న‌న్ను మిస్ గైడ్ చేశారంటూ సంచ‌ల‌న కామెంట్స్

Payal: టాలీవుడ్‌కి ఆర్ఎక్స్100 చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. చిత్రంలో ఈ అమ్మ‌డు నెగెటివ్ పాత్ర పోషించి విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్ స్టార్ హీరోయిన్‌గా మారుతుంద‌ని కొంద‌రు ఆశాభావం వ్యక్తం చేశారు. కాని అమ్మ‌డిని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో ఆమె పరిస్థితి దారుణంగా మారింది.  రీసెంట్‌గా పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మాయా పేటిక. ఈ చిత్రం రీసెంట్‌గా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన రెస్పాన్స్  ఈ చిత్రానికి రావడం లేదు. ఇటీవ‌ల మూవీ  చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాయల్ రాజ్ పుత్  తన జీవితంలో జరిగిన వాటి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్‌గా మారాయి.

అందం, ప్రతిభ ఉన్న మీకు త‌గిన గుర్తింపు దక్కలేదని చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని పాయల్ రాజ్ పుత్ ని యాంకర్ ప్రశ్నించాగా, దానికి అమ్మ‌డు  సమాధానం ఇస్తూ.. నా వరకు నేను ప్రతి చిత్రం కోసం ఎంతో కమిట్మెంట్ గా వర్క్ చేస్తాను. 200 శాతం ఎఫర్ట్ పెడతాను. అయితే   ప్రతి చిత్రం వర్కౌట్ అవుతోందా లేదా అనేది నా చేతుల్లో  ఏ మాత్రం ఉండదు. అది అదృష్టం, విధిరాత పై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా లోతుగా వెళితే… ఆర్ఎక్స్ 100 సూపర్ హిట్ తర్వాత నన్ను చాలా మంది మిస్ గైడ్ చేశారు. దీనితో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. సినిమా పరిశ్రమకి కొత్తగా వచ్చాను కాబట్టి అంత మెచ్యూరిటీ లేదు.

ఇప్పుడు మాత్రం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని పాయల్ పేర్కొంది.. ఎలాంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే సంతకం చేస్తున్న‌ట్టు పేర్కొంది.. చిత్ర  పరిశ్రమలో టాప్ లోకి వెళ్తాం.. అలానే కిందికి పడిపోతాం. కానీ తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది.. నెగటివిటీని వదిలేసి, పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నా అంటూ పాయ‌ల్ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం పాయ‌ల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇక  ఇప్పుడు  తనకు తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్‌లోనే ‘మంగళవారం’ అనే సినిమా చేస్తోంది పాయల్. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...