Home Film News Niharika Husband: విడాకుల‌తో మ‌న‌శ్శాంతి కోల్పోయిన నిహారిక భ‌ర్త‌.. ఏకంగా ఆశ్ర‌మంలో చేరాడుగా..!
Film News

Niharika Husband: విడాకుల‌తో మ‌న‌శ్శాంతి కోల్పోయిన నిహారిక భ‌ర్త‌.. ఏకంగా ఆశ్ర‌మంలో చేరాడుగా..!

Niharika Husband: అంగ‌రంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత సైలెంట్‌గా విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కామ‌న్ అయిపోయింది. ఎవ‌రైన పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటే వారం ముందు నుండే నానా హంగామా ఉంటుంది. హ‌ల్దీ, మెహందీ, సంగీత్ ఇలా ఒక‌టేంటి   నానా హంగామా చేసుకుంటూ వివాహం చేసుకుంటున్నారు. కాని ఏదైన విష‌యంలో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి ఇక క‌లిసి ఉండ‌లేమ‌ని అనిపిస్తే సైలెంట్‌గా విడాకులు తీసుకుంటున్నారు. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల విష‌యం గురించి ఎన్నో ప్ర‌చారాలు సాగగా, ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 2, 2021న తాము విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన శ్రీజ‌, నిహారిక విడాకుల గురించి ఇంత వ‌ర‌కు పూర్తి క్లారిటీ లేదు.

కొన్నాళ్లుగా మెగా అల్లుళ్లు ఇద్దరు వారి ఇంట్లో జరిగే వేడుక‌ల‌లో క‌నిపించ‌డం లేదు. అలానే వారి సోష‌ల్ మీడియా పోస్ట్‌లు విడాకులు తీసుకున్నార‌నే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, అవి రెండు పెటాకులు అయ్యాయి. ఇక నిహారిక విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకుంది. ఎంతో అట్ట‌హాసంగా వీరి పెళ్లి జ‌రిగింది. కొన్నాళ్లు బాగానే క‌లిసి ఉన్నారు. కాని ఏమైందో ఏమో కాని కొద్ది నెల‌ల క్రితం చైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రాములో నిహారిక పెళ్లికి సంబంధించిన పిక్స్ అన్నీ డిలీట్ చేశాడు.

ఇక వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక త‌న భ‌ర్త‌తో కాకుండా సోలోగా క‌నిపించింది. దీంతో వారిరివురు దూరంగా ఉంటున్నారు, విడాకులు కూడా తీసుకున్నారు అని అంద‌రు క‌న్‌ఫాం అయ్యారు. అయితే సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌ని చైత‌న్య చాలా నెల‌ల త‌ర్వాత తన సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.  ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా  మెడిటేషన్ సెంటర్ ఫోటోలు షేర్ చేసిన ఆయ‌న  ఇలాంటి స్థలానికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ప‌ది రోజుల నుండి నేను  విపస్సనా యోగను చేయడం వల్ల నా  జీవితం ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది అని అన్నాడు. నిహారిక జ్ఞాపకాలు తొల‌గించుకునేందుకు తాను అక్క‌డికి వెళ్లాడా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...