Home Film News Krithi Shetty: ఆ స్టార్ హీరో కొడుకు నుండి కృతి శెట్టికి తీవ్ర వేధింపులు.. దానికి ఒప్పుకోవాలంటూ టార్చ‌ర్
Film News

Krithi Shetty: ఆ స్టార్ హీరో కొడుకు నుండి కృతి శెట్టికి తీవ్ర వేధింపులు.. దానికి ఒప్పుకోవాలంటూ టార్చ‌ర్

Krithi Shetty: స‌మాజంలో మ‌హిళ‌ల‌కు భద్ర‌త లేకుండా పోయింది. మ‌హిళ అడుగు బ‌య‌ట పెడుతుందంటే ఇంట్లో వాళ్ల గుండెల‌లో భ‌యం మొద‌ల‌వుతుంది. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు అమ‌ల‌వుతున్నా కూడా కొంద‌రు దుర్మార్గుల నుండి మ‌హిళ‌లు త‌ప్పించుకోలేక‌పోతున్నారు. సినిమా ప‌రిశ్ర‌మ‌లోను మ‌హిళ‌ల‌కు వేధింపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మీటూ లాంటి ఉద్యమాలు వచ్చిన‌, త‌మకు జ‌రిగిన అన్యాయాల‌ని బ‌హిర్గ‌తం చేస్తున్నా కూడా కొంద‌రి నుండి న‌టీమ‌ణుల‌కి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఆ మ‌ధ్య న‌టి  నిత్య మీనన్ త‌న‌తో ఓ స్టార్ హీరో అనుచితంగా ప్రవర్తించాడంటూ కామెంట్స్ చేసింది. ఇక రీసెంట్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ త‌నని కొంద‌రు ద‌ర్శ‌కులు వాడుకొని వ‌దిలేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండ్ట్రీలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. కొంద‌రు ఈ విష‌యాల‌ని బ‌ట్ట‌బ‌యలు చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మ‌న‌సులోనే దాచుకుంటున్నారు. ఇప్పుడు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి ఓ స్టార్ హీరో కుమారుడి నుండి వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ట‌. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా త‌ర్వాత ఆమెకి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఉప్పెన‌లో కృతి న‌ట‌న చూసి ఈ అమ్మడు త‌ప్ప‌క స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నారు. అయితే  ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి న‌టించిన  శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త  పర్వాలేదనిపించాయి. కాని ఆ తర్వాత నితిన్ తో చేసిన  మాచర్ల నియోజకవర్గం, రామ్ తో వారియర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

వాటి త‌ర్వాత వ‌చ్చిన‌ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాగ చైత‌న్య‌ ‘కస్టడీ’ ఇలా ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా ఫ్లాఫులుగా నిలిచాయి. ఈ క్ర‌మంలో కృతి త‌న కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టాల‌ని అనుకుంటుడ‌గా, ఓ కోలీవుడ్ స్టార్ హ‌రో త‌నయుడి వ‌ల‌న చాలా ఇబ్బందులు ప‌డుతుంద‌ట‌.అత‌ను త‌న‌తో స్నేహం చేయాలని కృతిని ఇబ్బంది పెడుతున్నాడ‌ట‌. కృతి శెట్టికి షూటింగ్ ఉన్నా కూడా అది క్యాన్సిల్ చేసుకొని త‌న బ‌ర్త్ డేకి రావాల‌ని చెప్పాడ‌ట‌. అందుకోసం ఎన్ని కోట్లు అయిన ఇస్తాన‌ని అన్నాడ‌ట‌. ఫోన్స్ చేసి చాలా టార్చ‌ర్ చేస్తుండ‌గా, తాను పార్టీల‌కి రాన‌ని మొహం మీదే కాల్ క‌ట్ చేసింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఇంతకు ఆ హీరో కొడుకు ఎవ‌రా అని ప్ర‌తి ఒక్క‌రు ఆరాలు తీస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...