Home Film News Sai Pallavi: సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ట్రెండింగ్‌లో సాయి ప‌ల్ల‌వి..ఈ ఘ‌న‌త అమ్మడికే సొంతం..!
Film News

Sai Pallavi: సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ట్రెండింగ్‌లో సాయి ప‌ల్ల‌వి..ఈ ఘ‌న‌త అమ్మడికే సొంతం..!

Sai Pallavi: అభిమానుల చేత లేడి ప‌వ‌ర్ స్టార్‌గా పిలిపించుకుంటున్న సాయి ప‌ల్ల‌వి ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాలు పెద్ద‌గా చేయడం లేదు. విరాట ప‌ర్వం త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి మ‌ళ్లీ తెలుగు సినిమా చేయ‌లేదు. ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో సాయి ప‌ల్ల‌వి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే  ఈ వార్త చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.. సాయిపల్లవిని తమ అభిమాన హీరోతో చూడాలని ఎంతో ఆరాటప‌డ్డ అభిమానుల‌కి త‌ర్వాత నిరాశే మిగిలింది. సాయి ప‌ల్ల‌వి టీం ఆ వార్త‌లు అవాస్తం అని చెప్ప‌డంతో  ఎన్టీఆర్‌ అభిమానులు నిరాశ వ్యక్తం చేసారు.

సినిమాలు చేసిన చేయ‌క‌పోయిన సాధార‌ణంగా హీరోలు ట్రెండింగ్‌లో ఉంటారు. కాని సాయి ప‌ల్ల‌వి పెద్దగా సినిమాలు చేయ‌క‌పోయిన ట్రెండింగ్‌లో నిలుస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా ఆ మాయ కంటిన్యూ చేస్తూనే ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. చివ‌రిగా గార్గి అనే సినిమాలో వెరైటీ రోల్ పోషించి విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌లు పొందింది. ప్ర‌స్తుతం శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇక తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారంటే దానికి స‌మాధానం లేదు.

తాను సినిమా చేస్తే విమ‌ర్శ‌కులు ఆ సినిమాపై విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉండాలి. అలాంటి క‌థ‌ల‌ని మాత్ర‌మే ఈ అమ్మ‌డు ఎంచుకుంటుంది.క‌థ‌, క‌థనంతో పాటు త‌న పాత్ర‌ని ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకునేలా ఉంటేనే సాయి ప‌ల్లవి ఆ క‌థ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. అందులో ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తుంది. ప్ర‌స్తుతం శివ కార్తికేయ‌న్ సినిమాతో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు ఈ చిత్రం పూర్త‌య్యే లోపు మంచి క‌థ‌ని ఎంపిక చేసుకొని సినిమా చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైన సాయి ప‌ల్ల‌వి సినిమా కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...