Home Film News Pawan: రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌పంచ‌మంతా తెలుసు.. నేను మాత్రం తెలియ‌దంటూ ప‌వ‌న్ స్ట‌న్నింగ్ కామెంట్స్
Film News

Pawan: రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌పంచ‌మంతా తెలుసు.. నేను మాత్రం తెలియ‌దంటూ ప‌వ‌న్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Pawan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తూ బ‌హిరంగ స‌భ‌ల‌లో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ముమ్మడివరంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్  మాట్లాడుతూ  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హీరోల అభిమానులు  రైతులకు కూడా అండగా నిలబడాలని కోరారు. ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అందరి హీరోల అభిమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే.. వారందరూ నాకు కూడా ఇష్టమే.. వారి సినిమాలు నేను కూడా చూస్తాను..

రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు కాబ‌ట్టి వారికి అండగా నిలబడాలి అంటూ కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. .. మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే చాలా పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అయ్యారు.. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారని..  చెప్పడంలో నాకు ఎలాంటి ఈగో లేదు. ప్రజల కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడాలంటూ కోరారు.  ప్రపంచమంతా వాళ్ళు తెలుసు. నేను ప్రపంచం అంతా తెలియ‌క‌పోవ‌చ్చు. నాకు ఇలా చెప్పడానికి ఎలాంటి ఈగోలు లేవు. నాకు ఒక సగటు మనిషి బాగుండాలి. కులాలు, హీరోల పరంగా కొట్టుకోవద్దు అంటూ ప‌వ‌న్ కీల‌క‌మైన కామెంట్స్ చేశారు.

నాకు కొంతమంది చెప్తూ ఉంటారు.. మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు గొడవ పడతారు అని.. మేమంద‌రం మంచిగానే ఉంటాం. మీరు ఎందుకు గొడ‌వ‌లు ప‌డ‌డం.మీరు ఏ హీరోని అయిన ఇష్ట‌ప‌డండి కాని, రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఒక్క‌సారి నా మాట వినండి అంటూ ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి, ఇంత త‌గ్గి మాట్లాడ‌డం ప‌వ‌న్ వ‌ల్ల‌నే అవుతుందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...