Home BoxOffice This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!
BoxOfficeFilm NewsOTT

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి ఇప్పుడు థియేట‌ర్‌తో పాటు ఓటీటీలోను మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. మేక‌ర్స్ వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు మంచి టైం పాస్‌గా మారాయి. జూన్‌లో మాత్రం బ‌డా సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు రెడీగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆదిపురుష్‌పై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌త  ఐదు నెలలు చూస్తే..  దాదాపు నెలకు రెండేసి చొప్పున 13 హిట్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.. ఇక జూన్ నెలలో విడుద‌ల కానున్న‌ ‘ఆదిపురుష్’ భారీ హిట్ ద‌క్కించుకుంటుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ సినిమాపై నెగెటివిటీ తీసుకొచ్చిన ట్రైల‌ర్ మాత్రం అంచ‌నాలు భారీగానే పెంచింది.  ఈ నెల 16న ఆదిపురుష్‌ విడుదల కాబోతుంది. దీని కోసం భారీ ఎత్తున స‌న్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇదే నెల‌లో ద‌గ్గుబాటి అభిరామ్ న‌టించిన అహింస‌,నిఖిల్ న‌టించిన స్పై చిత్రాలు కూడా విడుద‌ల కాబోతున్నాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస చిత్రం మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఈ చిత్రం ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది చూడాలి.  బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ కూడా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందిసముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’.  శివ ప్రసాద్ యానాల  ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన‌ ఈ సినిమా జూన్ 9న గ్రాండ్‌గా  విడుదల కాబోతుంది. ఇక అదే రోజు  టక్కర్, అన్‌స్టాపబుల్, ట్రాన్స్‌ఫార్మార్స్ వంటి సినిమాలు  కూడా రిలీజ్  కాబోతున్నాయి. జూన్ 15న హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ మూవీ వరల్డ్  వైడ్ గా రిలీజ్ కానుంది.   మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించిన మ‌ను చ‌రిత్ర అనే సినిమా జూన్ 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి.  నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ మూవీ జూన్ 29న రిలీజ్ కానుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి వస్తోన్న మరో ప్యాన్ ఇండియా మూవీ కావ‌డంతో దీనిపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాలు సైతం సంద‌డి చేయ‌నున్నాయి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...