Home Film News Jabardasth Comedian: మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్.. అమ్మాయి ఎవ‌రంటే..!
Film News

Jabardasth Comedian: మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్.. అమ్మాయి ఎవ‌రంటే..!

Jabardasth Comedian: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచిన కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ షో ద్వారా ఎంతో మంది లైఫ్ సెటిల్ అయింది. కొందరు హైద‌రాబాద్‌లో రిచ్‌గా ఇల్లు క‌ట్టుకొని ఆ త‌ర్వాత పెళ్లిళ్లు కూడా చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయ్యారు. అయితే మంచి స్థాయిలోకి వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిన‌ కెవ్వు కార్తీక్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విష‌యాన్ని మ‌నోడే సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు.దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీస్ కూడా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. అదిరే అభి, ప్రియాంక సింగ్‌, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, అభిన‌వ్ త‌దిత‌రులు కార్తీక్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌గా, ప్ర‌స్తుతం కెవ్వు కార్తీక్ పోస్ట్ అయితే నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

అయితే కెవ్వుకార్తీక్ మాత్రం త‌ను చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రనే దానిని స‌స్పెన్స్ లో ఉంచాడు. ఫోటోలో ఆ అమ్మాయి ముఖాన్ని కనిపించనివ్వకుండా క‌వ‌ర్ చేశాడు. మ‌రి రానున్న రోజుల‌లో పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తాడేమో చూడాలి. ఇక కెవ్వు కార్తీక్ విష‌యానికి వస్తే..  మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన కార్తీక్ త‌న కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు దాటుకుని ఉన్న‌త స్థానానికి చేరుకున్నాడు.  కామెడీ క్లబ్  ద్వారా మ‌నోడికి కాస్త గుర్తింపు  ద‌క్కింది. ఆతరువాత జ‌బ‌ర్ద‌స్త్ లో కంటెస్టెంట్‌గా  చేరి, ఇక తన కామెడీతో అంద‌రిని అల‌రిస్తూ అక్కడే పాతుకుపోయాడు.

అంచెలంచలుగా ఎదుగుతూ వ‌చ్చిన కెవ్వు కార్తీక్.. ముక్కు అవినాష్ తో కలిసి సొంత టీమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు . ఆతరువాత కాలంలో అవినాశ్.. జబర్థస్త్ ను వీడటంతో.. కార్తీక్ సోలో టీమ్ లీడర్ గా నిలిచి త‌న స‌త్తా చూపించాడు..  కెవ్వు కార్తీక్‌ది వరంగల్ కాగా, అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాడు. జబర్దస్త్ ద్వారా  అత‌నికి మంచి గుర్తింపు వ‌చ్చింది. అత‌నిని అందరు గుర్తుపట్టడం ప్రారంభించారు. 2016లో అమెరికా వెళ్లిన కార్తీక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా వంటి చాలా దేశాలు కూడా చుట్టొచ్చాడు. మ‌రి త‌న పెళ్లికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...