Home Film News Marriage Fix: వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కి టైం ఫిక్స్.. అతిథులు ఎవ‌రంటే..!
Film News

Marriage Fix: వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కి టైం ఫిక్స్.. అతిథులు ఎవ‌రంటే..!

Marriage Fix: ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారి ప్రేమ వ్య‌వ‌హారాల‌తో పాటు పెళ్లికి సంబంధించిన వార్త‌లు కూడా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల గురించి జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి.ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని అనేక రూమ‌ర్స్ న‌డిచాయి. ఆ రూమ‌ర్స్ ఇప్పుడు నిజం కాబోతున్నాయ‌ని అంటున్నారు. ఇటీవల ప్లాప్ లు చూసిన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమాయణం, డేటింగ్ చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌గా, ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నార‌ని టాక్ వినిపిస్తుంది.

 

బాలీవుడ్ మీడియా  చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే… జూన్ 9న వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం సెట్ చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టార‌ట కూడా. ఎంగేజ్మెంట్ వేడుకకు కావాల్సిన దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్న‌ట్టు వినికిడి. ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించ‌నుండ‌గా, ఈ వేడుక‌కి మెగా ఫ్యామిలీ హీరోలు మాత్ర‌మే అతిథులుగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలు ఈవెంట్‌లో సంద‌డి చేయ‌నుండ‌గా, ఈ వేడుక‌ నేషనల్ వైడ్ న్యూస్ కానుందని చెబుతున్నారు.

పెళ్లి మాత్రం  అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారని విశ్వసనీయ సమాచారం అందుతుంది. కాగా, గత ఏడాది కాలంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి  ప్రేమ‌లో ఉన్నార‌ని, వీరిద్ద‌రు క‌లిసి పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం న‌డుస్తుంది.. ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య త్రిపాఠి ఈ వార్తలను ఖండిస్తూ వ‌చ్చింది. వరుణ్ తేజ్ నాకు మిత్రుడు మాత్రమే… అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఆమె చెప్పుకొచ్చిన కూడా ప్ర‌చారాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు పుకార్లు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. చివ‌రిగా.. వరుణ్ తేజ్ కి జంటగా లావణ్య మిస్టర్ మూవీ చేయ‌గా, ఈ చిత్రానికి  శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన‌ట్టు చెబుతున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...