Home Film News ‘మీ అభిమానం.. నేను సాధించిన వరం’ అంటున్న ఉదయ భాను.. వీడియో వైరల్..
Film News

‘మీ అభిమానం.. నేను సాధించిన వరం’ అంటున్న ఉదయ భాను.. వీడియో వైరల్..

Udaya Bhanu: ‘‘మీ అభిమానం.. నేను సాధించిన వరం.. మీ ప్రేమ.. అభివర్ణించలేని అద్భుతం.. నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నా ధైర్యమై నిలిచింది మీరే.. మీ అభిమానంతో నన్నెప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు.. మీ గుండెల్లో పెట్టుకున్నారు.. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చెయ్యడం తప్ప.. అందుకే వస్తున్నా’’ అంటూ ఉదయ భాను చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CebSkCMpIKT/

ఉదయ భాను.. తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. ఒకనాకొ టైంలో స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ తను.. ఈవెంట్స్ అయినా, గేమ్ షోస్ అయినా, సాహసమైనా, జానపదమైనా, డ్యాన్స్ షో అయినా, పిల్లలు పిడుగులు లాంటి కిడ్స్ షో అయినా, నిగ్గదీసి అడుగు లాంటి పవర్ ఫుల్ ప్రశ్నించే షో అయినా.. ప్రతీ షో ప్రత్యేకమే.. మాటైనా, పాటైనా ఆమెకి తిరుగులేదని ప్రూవ్ చేసుకుంది.

తన జెనరేషన్ యాంకర్స్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్.. ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పాలంటే ‘లేడీ లయన్’ అన్నమాట.. అన్నమాటేంటి, ఉన్నమాటే.. తేడా చేస్తే.. తన ఎదురుగా ఉన్నది ఎంత పెద్దవ్యక్తి అయినా సరే.. ‘ఎవడైతే నాకేంటి’ అనే రేంజ్‌లో తను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పడం భాను స్టైల్.. దానివల్ల కొన్ని ఇబ్బందులెదురైనా ‘ఐ డోంట్ కేర్’ అంటుందామె.

https://www.instagram.com/p/CYLQvfmlizP/

పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఇద్దరు పాపలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న ఉదయ భాను కాస్త గ్యాప్ తర్వాత ఈమధ్య అప్పుడప్పుడు ఈవెంట్స్‌లో సందడి చేస్తుంది. ఇన్నాళ్లూ తనను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు, థ్యాంక్స్ చెబుతూ.. తన తరపునుండి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందివ్వడానికి చాలా పెద్ద ప్లాన్‌తో రాబోతోంది.

https://www.instagram.com/p/CbPO7xurBDq/

అందుకోసం ‘ఉదయ భాను ప్రొడక్షన్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది.. అసలు భాను ప్లాన్ ఏంటి, ఎలాంటి వీడియోస్ చెయ్యబోతోంది.. ఏంటి కథ అనే వివరాలు తెలియాలంటే Udaya Bhanu యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...