Home Film News Hanu Man : ‘హను-మాన్’ లో ‘సూపర్ మేన్’ గా ‘వాన’ హీరో..
Film News

Hanu Man : ‘హను-మాన్’ లో ‘సూపర్ మేన్’ గా ‘వాన’ హీరో..

VINAY RAI
VINAY RAI

Hanu Man: ఫస్ట్ మూవీ ‘అ!’ తో తెలుగు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచి, ‘యాంగ్రీ స్టార్’ రాజ శేఖర్‌ని ‘కల్కి’ గా చూపించి, ‘జాంబీరెడ్డి’ తో టాలీవుడ్‌కి జాంబీస్‌ను పరిచయం చేసిన యంగ్ అండ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టి.. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ‘జాంబీరెడ్డి’ సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ప్ర‌శాంత్ వ‌ర్మ‌ చేస్తోన్న ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ . ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవ‌ల విడుద‌లైన ‘హను–మాన్‌’ టైటిల్, టైటిల్ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. మన పురాణాలు ఇతిహాసాల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌ హీరోస్‌ గురించి మనకు తెలుసు. సూపర్‌ హీరోస్‌ మూవీస్‌లో హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అంతే కాకుండా ‘హను–మాన్‌’ మ‌న భారతీయులకు సూపర్ హీరో.

ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ మేన్‌గా కనిపించనున్న వినయ్ రాయ్ లుక్ రిలీజ్ చేశారు. వినయ్ ‘వాన’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బ్యాగ్రౌండ్‌లో అతని అనుచరులు, టెంపుల్ ఉండగా నడుచుకుంటూ వస్తున్న వినయ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిలింగా తెరకెక్కుతున్న ‘హను–మాన్‌’ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే మరెన్నో విశేషాలున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...