Home Film News వీళ్ల పనే బాగుంది భయ్యా.. భలే సంపాదిస్తున్నారు!….
Film News

వీళ్ల పనే బాగుంది భయ్యా.. భలే సంపాదిస్తున్నారు!….

Telugu Anchors
Telugu Anchors

సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసే స్టార్లకి మేమేం తక్కువ కాదంటున్నారు స్మాల్ స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీలు. వాళ్లు ఆర్నెళ్లపాటు, సంవత్సరాల తరబడి షూటింగులు చేసి థియేటర్లలోకి వస్తారు.. అదే మేమైతే ప్రతిరోజు తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి వచ్చేస్తాం అంటున్నారు. పైగా సంపాదనలోనూ సినిమా వాళ్లకేం తీసిపోం అని నిరూపిస్తున్నారు. షోలు, ఈవెంట్లతో పాటు స్పెషల్ ప్రోగ్రాంస్ హోస్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకుంటున్నారు. జనరల్‌గా సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి పబ్లిక్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ఆసక్తిగా ఆరా తీస్తే.. బుల్లితెర స్టార్స్ ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారనే వివరాలు తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

⦁ సుమ.. స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్.. అందులో నో డౌట్.. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా సుమ ఉంటే ఆ సందడే వేరు. సుమ హోస్ట్ చేస్తుందంటే.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏం మాట్లాడాలో అని ప్రిపేర్ అయ్యి వస్తారు అని ఇటీవల త్రివిక్రమ్ ఓ ఫంక్షన్ లో చెప్పారు. ఆమె హోస్టింగ్ గురించి చెప్పడానికిది చిన్న ఎగ్జాంపుల్. సుమ ఒక్కో సినిమా ఫంక్షన్ కి రెండు నుండి రెండున్నర లక్షల వరకు తీసుకుంటుంది.

అనసూయ.. టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తను ఒక్కో ఈవెంట్ కి రెండు లక్షలు అందుకుంటుదట.

⦁ ఇక జబర్దస్త్ రష్మీకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మడు ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంటే భలే ఉంటుంది. రష్మీ రెమ్యునరేషన్ లక్షన్నర అని టాక్.

టీవీ షోలతో పాపులర్ అయిన శ్రీముఖి.. బిగ్ బాస్‌లో పార్టిసిపెట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. యూత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి లక్ష వరకు ఛార్జ్ చేస్తుందట..

⦁ యాంకర్ మంజూష గుర్తుందా.. ‘రాఖీ’ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా చేసింది. ‘బొమ్మరిల్లు’లో సిద్దార్థ్ ఫ్రెండ్‌గా కనిపించింది. మధ్యలో కొన్నాళ్లు ప్రొఫెషన్‌కి బ్రేక్ ఇచ్చి, ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో సందడి చేస్తుంటుంది కూడా. మంజూష ఈవెంట్‌కి యాభై వేల చొప్పున తీసుకుంటుంది.

⦁ విష్ణు ప్రియ.. టీవీ షోలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది కానీ అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. తన స్థాయికి తగ్గట్టు షోలకి, ఎపిసోడ్ కి 10 నుండి 15 వేలు తీసుకుంటుందని అంటున్నారు.

⦁ యాంకర్ శ్యామల కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఒక్కో ప్రోగాంకి 40 నుండి 50 వేలు పారితోషికంగా అందుకుంటుంది. అలాగే నవ్య స్వామి 20 వేలు, యాంకర్ ప్రశాంతి 15 వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...