Home Film News Kajal Aggarwal: రెండోసారి తల్లి కాబోతున్న కాజల్.. ఇక పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పనుందా?
Film News

Kajal Aggarwal: రెండోసారి తల్లి కాబోతున్న కాజల్.. ఇక పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పనుందా?

Kajal Aggarwal: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. పెళ్లైన త‌ర్వాత కూడా ఈ అమ్మ‌డికి సినిమా ఆఫ‌ర్స్ భారీగానే వ‌స్తున్నాయి. వెండితెరపై ఎన్ని విభిన్నమైన పాత్ర‌లు పోషించిన కాజల్ ఇటీవ‌ల కాస్త స్పీడ్ తగ్గించింది.అయితే ప్ర‌స్తుతం బాల‌య్య‌తో క‌లిసి భగవంత్ కేసరి అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో పాటు కరుంగాపియం, పారిస్ పారిస్.. క్వీన్ రీమేక్, ఇండియన్ 2 వంటి తమిళ సినిమాలు కూడా చేస్తుంది. ప‌లు హిందీ చిత్రాలు కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కాజ‌ల్ 2020 అక్టోబర్ నెలలో తన చిరకాల మిత్రుడు అయిత‌న‌ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ నెలలో వీరికి ఒక అబ్బాయి పుట్టగా,నీల్ కిచ్లు అనే పేరు పెట్టారు.

ఇక కాజ‌ల్ కి సంబంధించి తాజాగా ఓ ప్ర‌చారం జొరుగా న‌డుస్తుంది అయితే ఆమె మరోసారి తల్లి అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. కాజల్ రెండోసారి గర్భం దాల్చారని, ఈ క్ర‌మంలో ఆమె పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పాలనుకుంటున్న‌ట్టు జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయిదే దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేక‌పోయిన‌ప్ప‌టికీ వార్త మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాజ‌ల్ ప్ర‌స్తుతం బాల‌య్య సినిమాతో పాటు పెళ్ళికి ముందు ఒప్పుకున్న భారతీయుడు 2 మూవీ పూర్తి చేసే ప‌నిలో ఉంది.కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు పూర్త‌య్యాక కాజ‌ల్ ఇక సినిమాలు చేయ‌ద‌ట‌.

 

ఇప్పటికే హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లి నిధి అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పింది. చెల్లెలు దారిలోనే కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు వెళ్లాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే కొంత మంది దర్శకులు అప్రోచ్ అయిన‌ప్ప‌టికీ ఆఆఫ‌ర్స్‌ని ఈ అమ్మ‌డు సున్నితంగా తిర‌స్క‌రిస్తుంద‌ట‌. కాజ‌ల్ ప్ర‌స్తుతం బిజినెస్‌పై దృష్టి సారిస్తుంది. ఓ కిడ్స్ కాస్ట్యూమ్స్ కి సంబందించిన వ్యాపారం స్టార్ట్ చేసిన కాజ‌ల్‌.. చెల్లెలు నిధి అగర్వాల్ తో కూడా ఓ వ్యాపారం మొద‌లు పెట్టింది. ఈ ప‌రిస్థితులు చూస్తుంటే కాజ‌ల్ ఇక సినిమాలు చేయ‌ద‌ని, పిల్ల‌ల‌ని చూసుకుంటూ వ్యాపారాల‌పై దృష్టి పెట్టాల‌ని భావిస్తుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...