Home Film News Prabhas Fans: సినిమా బాలేదు అన్నందుకు వ్య‌క్తిని చిత‌క‌బాదిన ప్ర‌భాస్ ఫ్యాన్స్
Film News

Prabhas Fans: సినిమా బాలేదు అన్నందుకు వ్య‌క్తిని చిత‌క‌బాదిన ప్ర‌భాస్ ఫ్యాన్స్

Prabhas Fans: ఇటీవ‌ల అభిమానుల ఆగ్ర‌హావేశాలని కంట్రోల్ చేయ‌డం ఎవరి వ‌ల‌న కావ‌డం లేదు. త‌మ హీరోల‌ని ఎవ‌రైన ఏమ‌న్నా అన్నా లేదంటే త‌మ హీరోల సినిమాలని బాలేదని చెప్పిన కూడా వారిపై దాడుల‌కి దిగుతున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా ఆదిపురుష్ సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వారిపై దాడుల‌కి దిగారు ప్ర‌భాస్ ఫ్యాన్స్ . వివ‌రాల‌లోకి వెళితే.. ఈ రోజు దేశ వ్యాప్తంగా భారీ అంచనాల‌తో విడుద‌లైంది ఆదిపురుష్ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా, ప్రపంచమంతటా కూడా జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి అని చెప్పాలి.. అయితే మూవీ దర్శకుడు ఓం రౌత్ చెప్పినట్టు.. సినిమా చూడడానికి సాక్షాత్తు ఆ హనుమంతుడే థియేటర్ కి వచ్చారా అన్న‌ట్టు అక్క‌డి వాతావ‌ర‌ణం ఉంది

థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప్ర‌భాస్ అభిమానుల సంద‌డి మాములుగా లేదు. థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌రిస్థి చూస్తుంటే హనుమంతుడే ఆ వానర రూపంలో వచ్చారా అన్న సందేహం కలుగుతుంది. అయితే ఆదిపురుష్ సినిమా ఆడుతున్న థియేటర్ లోకి అనుకోకుండా ఒక మారుతి వచ్చింది. అసలు అది ఎలా వచ్చిందో తెలియదు కానీ అందరితో కలిసి మారుతి తెగ సంద‌డి చేసింది. ఆ సమయంలో ప్రభాస్ రాముడి వేషంలో ఒక డైలాగ్ చెప్పుకొచ్చారు. శత్రువుని చంపితే శత్రుత్వం చావదు. క్షమించి చూద్దాం అని ప్ర‌భాస్‌ చెప్పే డైలాగ్ కి అయితే ప్రేక్షకులతొ పాటు ఫ్యాన్స్ కూడా జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దీంతో థియేట‌ర్ మొత్తం మారుమ్రోగింది.

అయితే ఆదిపురుష్ థియేట‌ర్ ద‌గ్గ‌ర సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆదిపురుష్ మూవీ బాగాలేదని మీడియాతో చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ మూవీ ఎలా ఉందని మీడియా వాళ్ళు అడగ్గా, నచ్చలేదు అని కామెంట్ చేయ‌డంతో.. అక్కడే ఉన్న అభిమానులు అత‌నిని చితకబాదారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ మూవీ ఆకట్టుకున్నప్పటికీ… విజువల్ ఎఫెక్ట్స్, రావణుడు గెటప్ నిరాశపరిచాయని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. గతంలో ప్రభాస్ పౌరాణిక చిత్రం చేసింది లేక‌పోవ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి… అయితే రాముడిగా ప్రభాస్ అద్భుతం చేశాడన్నమాట వినిపిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు మిన‌హా చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని చెప్పాలి. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ మూవీ నిర్మించ‌గా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకి పాత్ర పోషించింది. అజయ్-అతుల్ సంగీతం సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఈ చిత్రం నేడు వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...