Home Film News Prabhas: రాత్రిళ్లంతా పీక‌ల‌దాకా తాగిన ప్ర‌భాస్.. తెల్లారేస‌రికి దేవుడు అయిపోతాడా..!
Film News

Prabhas: రాత్రిళ్లంతా పీక‌ల‌దాకా తాగిన ప్ర‌భాస్.. తెల్లారేస‌రికి దేవుడు అయిపోతాడా..!

Prabhas: రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న ప్ర‌భాస్ ఆ త‌ర్వాత చేసిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల‌తో దారుణ‌మైన విమ‌ర్శ‌లు అందుకున్నాడు. ముఖ్యంగా ఆదిపురుష్ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌గా, ఆయ‌న‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాముడిగా ప్ర‌భాస్ గెట‌ప్ ఏ మాత్రం బాగోలేదంటూ మండిప‌డ్డారు. ఆదిపురుష్ మూవీతో పాటు అందులో నటించిన లీడ్ రోల్స్ వేషధారణ, డైలాగ్స్‌పై కూడా తీవ్ర‌మైన అభ్యంత‌రాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే  సినిమాకి దారుణ‌మైన నెగెటివీటి వ‌చ్చింది. తొలి వారం వ‌రకు బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం రెండో వారానికి డీలా ప‌డింది.

అయితే ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాల‌ని కొంద‌రు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఆదిపురుష్ వివాదాలు అన్ని స‌ద్దుమ‌ణిగాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో  కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేశారు.  మహాభారతం లేదా రామాయణం వంటి సినిమాల కోసం స్టార్‌ హీరోలను ఎంపిక చేసుకుంటే ఏ మాత్రం ఫ‌లితం ఉండ‌దు.ఎవ‌రైన  పురాణ‌ కథల్లో దేవుడిగా నటించినంత మాత్రాన అది వాళ్లను దేవుళ్లుగా చేయదు అని అన్నారు. అయిత‌న   ప్రతి రోజూ రాత్రి పీకలదాకా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే ఎవ‌రు న‌మ్ముతారు.. ప్ర‌జ‌లు మూర్ఖులు కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

వివేక్ అగ్నిహోత్రి.. ప్ర‌భాస్‌ని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశాడని కొంద‌రు అభి ప్రాయపడుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కొంద‌రు వివేక్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న నుండి త్వ‌ర‌లో ప్రాజెక్ట్ కె, స‌లార్ చిత్రాలు రాబోతున్నాయి.  ఈ రెండు చిత్రాల‌తో ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత పీక్స్ కి వెళుతుంద‌ని అంటున్నారు.  ‘సలార్’ మూవీ సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శృతి తి హాసన్ కథానాయికగా నటించింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘కల్కి 2898 AD’ టైటిల్ ఫిక్స్  చేయ‌గా, జ‌న‌వ‌రిలో మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...