Home Film News Umair’s Tweet: పూజా హెగ్డే ఆత్మ‌హ‌త్య చేసుకుందని ఉమైర్ ట్వీట్.. లీగ‌ల్ నోటీసులు పంపిన బుట్ట‌బొమ్మ‌
Film News

Umair’s Tweet: పూజా హెగ్డే ఆత్మ‌హ‌త్య చేసుకుందని ఉమైర్ ట్వీట్.. లీగ‌ల్ నోటీసులు పంపిన బుట్ట‌బొమ్మ‌

Umair’s Tweet: ఇటీవ‌ల సెల‌బ్రిటీలంద‌రిని టార్గెట్ చేస్తూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్న ఉమైర్ సంధు కొన్నాళ్లుగా వార్త‌లలో నిలుస్తున్నారు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుంటూ రిలీజ్‌కి కొద్ది రోజులు ముందే రివ్యూలు చెప్పే అతనికి సోషల్ మీడియాలో చాలా మంంది శత్రువులు ఉన్నారు. ఇక ఇటీవ‌ల మ‌నోడు రూట్ మార్చాడు. హీరో లేదా హీరోయిన్ గురించి త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డం, అదీ కాదంటే వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వివాదాలు సృష్టించి హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న పూజా హెగ్డే గురించి త‌ప్పుడు కామెంట్స్ చేసి అంద‌రిని టెన్షన్ పెట్టాడు. పూజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని , స‌రైన స‌మ‌యంలో ఆమె కుటుంబ సభ్యులు గుర్తించడంతో కాపాడాకలిగారని ఉమైర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఉమైర్ చేసిన ప‌నికి పూజా హెగ్డే అభిమానులే కాక సినీ ప్రియులు కూడా ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పూజా హెగ్డేపై ఉమైర్ అంత చీప్ కామెంట్స్ చేసే స‌రికి పూజా హెగ్డే టీమ్ అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని ఆయ‌న ప్రౌడ్‌గా ఫీల‌వుతూ.. గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని సంతోష‌ప‌డుతున్నాడు. ఈయ‌న ధోర‌ణి చూస్తుంటే తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్లు ఉంది. ప్ర‌స్తుతం వేరే దేశంలో ఉండి ఇలా త‌ప్పుడు ట్వీట్స్ చేస్తూ ..లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి.ఈయ‌న పూజ హెగ్డేనే కాదు చాలా మంది సెల‌బ్రిటీలపై కూడా ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారు.

 

గ‌తంలో ఊర్వశి రౌతేలా ను అఖిల్‌ హెరాస్ చేశాడని సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ జ‌రుగుతున్న‌ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశికి కూడా అతనితో వర్క్ చేయడం న‌చ్చ‌క ఆ విష‌యాన్ని బ‌య‌ట చెప్పింద‌ని ఉమైర్ స్ప‌ష్టం చేశాడు. మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది సెల‌బ్రిటీల గురించి ఉమైర్ త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డం ఇటీవ‌ల కాలంలో ప‌రిపాటిగా మారింది. మ‌రి లీగ‌ల్ నోటీసుల‌ని కూడా ఆయ‌న లైట్‌గా తీసుకుంటుంటే మ‌రి ఆయ‌న ఆగ‌డాల‌కి ఎలా అడ్డుక‌ట్ట ప‌డుతుందో చూడాల్సి ఉంది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...